Sunday, October 10, 2010

భయం సిగ్గుపడాల్సిన విషయం కాదు

భయం సిగ్గుపడాల్సిన విషయం కాదు

భయాన్ని శక్తిగా మలచుకోవాలి:

భయం...అంటే ప్రతి ఒక్కరికీ భయమే.
ధైర్యంగా ఉండాల్సిన ఎన్నో సందర్భాల్లో అది మనల్ని వెంటాడి వేధిస్తుంది.
పదుగురిలో నగుబాటు పరుస్తుంది. 

కానీ భయం అనేది కూడా ఓ సహజ లక్షణమే.
కొందరికి చీకటంటే భయం
కొందరికి నీళ్లంటే భయం
కొందరికి నిప్పంటే భయం
కొందరికి కప్ప అంటే భయం
కొందరికి పామంటే భయం
కొందరికి కుక్కంటే భయం
ఎందుకో కానీ అందరికీ సాటి మనుష్యులంటే మరీ భయం!
మాట్లాడాలంటే భయం, స్టేజ్ ఎక్కితే భయం, 
ఎక్జామ్స్ అంటే భయం, జబ్బులంటే భయం,
కష్ట పడటమంటే భయం...
....మనిషి సుఖ జీవన ప్రయాణంలో 
బాధ కలిగించే ఇలాంటి ఎన్నో విషయాలంటే మనిషికి భయం.
ఆలా భయం ఉండటం కూడా రీజనబులేగా!

మరి సహజంగా కలిగే భయానికి భయపడటం, సిగ్గుపడటం ఎందుకు?
దాన్ని సమూలంగా అనుభూతించీ, మూలాల్లోకి వెళ్లి స్స్వస్థత పరచుకోవాలి. 
దేని పట్ల అయితే భయం ఉందో దాని పట్ల ఆ భయాన్ని శక్తిగా మార్చుకోవాలి. 
ఆ శక్తిని భయాన్ని జయించడానికి వాడాల్సిన పని లేదు.
ఆ శక్తిని ఆ విషయాన్ని జయించడానికి వాడాలి:
మనకు నీళ్లంటే భయం కదా అని కళ్ళు మూసుకుని,
భయాన్ని జయించాలని తపస్సు చేస్తే భయాన్ని జయించలేము.
ఆ భయాన్ని శక్తిగా కూడదీసుకుని, నీళ్ళల్లో దిగి ఈత నేర్చుకుంటే 
నీళ్లంటే ఉన్న భయం automaticగా పోతుంది.  
ఎప్పుడయితే కష్టం...అనుకున్న దాన్ని సాధిస్తామో...
అప్పుడిక మన భయాలు ఎండుటాకుల్లా గాలికి ఎగిరిపోతాయి.


నిజానికి...దేని పట్లా మనకు భయమంటూ లేకపోతే...
మనం దేన్నీ సాధించం. ఏ శక్తీ మనలో ఉండదు.
రేపటికి అన్నం ఉండదనే భయంతో ఈ రోజు సంపాదిస్తాం.
రేపు ఏం జరుగుతుందో అన్న భయం తోనే మనిషికి వినూత్న ఆవిష్కరణలు సాధ్య పడ్డాయి.
So...భయ పడదాం బాగుపడదాం.
అంతే గానీ భయానికి సిగ్గు పడటం మానేద్దాం.

భయం సిగ్గుపడాల్సిన విషయం కాదు,
భయం శక్తిగా మార్చుకోవలసిన అంశం!



2 comments:

  1. భయం సిగ్గుపడాల్సిన విషయం కాదు....super point praveena...promise i will try this.

    ReplyDelete