Sunday, September 25, 2011

సాటి మనుష్యులు...

{ ఒక స్నేహితురాలి ప్రశ్నకు సమాధానంగా... }
..........
ప్రశ్న: 
అందర్నీ darling, dear అంటున్నావ్ నన్ను dear అన్నట్టుగానే.. !
కొంత మంది sisters..ఇంతకు నేను dearనా కాదా? అర్థం కావట్లేదు. 
...madam, darling, dear, గురువు గారు..sister...
చాలా characters చేస్తున్నావ్ కదా!
don't mind...నిన్నటి దాకా నువేదో వాళ్ల g.f ఏమో అనట్లుగా మాట్లాడిన వాళ్లు... 
sudenga sister అంటే.. వెంటనే bro అనేస్తావ్...
relations manage చేయడం రాక fb రావటం మానేశా..నువ్ great dear...

నేను: 
ఏం చెప్పాలో అర్థం కాక...బుర్ర గోక్కుంటున్నాను...
..నేనేదో ఓ జ్ఞాన సముద్రం దగ్గర...
ఓ మారు మూల ఒడ్డున కూచ్చుని,
చిన్న చెలిమ తొవ్వుకుంటున్నాను దాహంతో.
మా దాహం కూడా తీర్చుకుంటాం అని.. 
మరి కొందరు దాహార్తులు...అటు వెళ్లే బాటసారులు అక్కడికి వస్తున్నారు...

వచ్చిన వాళ్లు వాళ్ల వాళ్ల బొచ్చెలు వాళ్లు చేతబుచ్చుకునే వస్తారు!
వాళ్లు గ్లాసు, చెంబు, గిన్నె, స్పూను, బిందె, బక్కెట్టు, డ్రమ్ము...
లేదా దోసిలి...వాళ్ల పాత్రలు వాళ్లు తెచ్చుకుంటారు...
వాళ్లు ఎంత తాగి.., ఎలా తాగి దాహం తీర్చుకోగలరో
అలా దాహం తీర్చుకుంటారు...
చెలిమ తవ్వుతున్నాను కదా అని వాళ్ల మీద నా పెత్తనం ఏమిటి???
అలా లేదు, ఉండదు!

అక్క, చెల్లి, ప్రియురాలు, స్నేహితురాలు, గురువు, అత్తా, పిన్ని, మమ్మీ...
వాళ్లు నన్ను ఏమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం...
వాళ్లను నేను ఏమనుకుంటున్నానూ...అనేదే నాకు ముఖ్యం!
వాళ్లను నేను నా లాంటి జ్ఞాన దాహార్తులు...అనుకుంటున్నాను...
నాలాగే జీవితాన్వేషణా సహా బాటసారులూ అనుకుంటున్నాను...
అన్నిటికన్నా... నా... "సాటి మనుష్యులూ"... అనుకుంటున్నాను!!!  

Monday, September 19, 2011

I did a MISTAKE.., yes I did...

ఒక తప్పు చేశాను...
Love One And All - Serve One And All...

ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదు!...
"నేను" ప్రేమించాను...
"నేను" సహాయం చేశాను...
"నేను" సేవలు చేసీ..., "నేను" పెద్ద తప్పు చేశాను!

ఒక అమ్మాయి ఇరవై ఏళ్ల వైవాహిక నరకం నుంచి బయట పడటానికి help చేశాను.
ఇందులో తప్పేముందీ అనుకుంటున్నారా?.., ఉంది.
ఆ, ఆ...So called problems జోలికి వెళ్లకండి...
అవి చిన్నవి. మనం వద్దనుకుంటే వాటిని వదిలించుకోగలం!
కానీ, మనకే తెలియకుండా మనం కొన్ని విష భావాల వలయంలో చిక్కుకుంటాం.
ఆ సుడిగుండంలో ఉన్నామని తెలియడానికే చాలా కాలం పడుతుంది,
ఇక బయటపడటం...అ..సాధ్యం!
చిన్నప్పట్నించీ ఆమెకు నేనంటే నమ్మకం...
ఏ రోజైనా ఆమె వద్దనుకుంటున్న జీవితాన్ని మార్చి ఇస్తానని!
నేనంటే ప్రేమ, గౌరవం...భక్తి కూడా!
ఒక్క ముక్కలో... నేనే తన angelని.
Hmmm, ఇక ఆగుతానా...
ప్రేమను ధారాళంగా పంచేశాను...
risk తీసుకుని help చేశాను.
ప్రేమ ఉంటే... అన్నీ ఉంటాయి...
ధనము, స్థలము, కాలము, జ్ఞానము.. అన్నీ..!
ఆమె నరక కూపం నుంచి బయట పడింది...
తన కాళ్ల మీదకు వచ్చింది, lifeలో settle అయ్యింది...
ఆట ఇప్పుడే మొదలయ్యింది...
నన్ను shuttle ఆడటం మొదలెట్టింది...
angel angle మారింది.
భక్తి పోయింది, ప్రేమ పోయింది...
కనీస గౌరవం కూడా పోయింది!

సాటి వారి సమస్యల పట్ల, పరిస్థితుల పట్ల విమర్శలు, సూటి,పోటి మాటలు, సెటైర్లు...
పిల్లికి బిచ్చం పెట్టే ఉద్దేశ్యం కూడా లేదా పిల్లకు...
సాటి మనుష్యులకు, స్త్రీలకు, కనీసం తన లాంటి అభాగినులకు అండగా నిలుస్తుందనుకుని నీళ్లు పోశాను ఆ చెట్టుకు! 
అహంకారం....తన చేత యేరు దాటిన తెప్పను తగులబెట్టించింది.
స్వార్థం.., అరిషడ్వర్గాలు.., So called భావాలు...
ఇల్లు మారింది, మనిషి మారాడు...కానీ ఆ పిల్ల పాత గూటి జీవితానికే స్వేచ్ఛను మితం చేసుకుంది..!

ఆ.., యే పక్షి యే గూటికి పొతే మనకెందుకూ...
ఎగురవేయడమే మన వంతు!
నిజమే కానీ, నేను కూడా ఇంకా దేవత..నూ.. అవ్వలేదుగా....మనిషినే!
మనిషన్నాక మంచీ, చెడ్డా ఉంటూనే ఉంటాయి.
మంచిదో, చెడ్డదో...కానీ ఆమె బాగుంది...నేనే పాడై పోయాను...
ఆమె ఎప్పుడు కనిపించినా కోపం, ఆవేశం, అనవసరంగా help చేశానన్న ద్వేషం....
ఇంకేదో తెలియని విద్వేషం!
ఆమె ప్రవర్తన కూడా అగ్గికి ఆజ్యం పోసినట్లు no respect, no love...nothing...
ఆమె మీద ప్రజ్వరిల్లు..తూ... రెండేళ్లు నా ఇల్లు, ఒళ్లు, సోలు...బాగా బాధలు పడ్డాక....
... Suddenగా ఈ రోజే నాకు, 'జ్ఞానోదయం' అయ్యింది!

 మనకు ఎంతో మంది ఎదురు పడుతూ ఉంటారు జీవితంలో,
చాలా మందికి కృతజ్ఞత, అపరాధ భావం ఉండవు.
అవి రెండూ లేని చోట ప్రేమ ఉండలేదు!
అది వారి నైజం. ఇక ప్రేమ, స్నేహం మన స్వభావం.
మనం ఇస్తున్నాం దానంగా....
మరి.., ఒక చేత్తో చేసిన దానం ఇంకో చేతికి కూడా తెలియ కూడదు..., అన్నారు పెద్దలు!
కానీ మనం... చేసిన దాన్ని మనసారా గుర్తు పెట్టుకుంటున్నాం...
అంతఃచేతనా మనసులోకి.., లో లోపలికి ఇంకేలా జాగ్రత్తగా దాచి పెట్టుకుంటున్నాం.
ఇక ఆ ప్రేమనో, డబ్బునో, సేవనో పొందిన వారు
మనం ఎక్కడ కనిపించినా ప్రేమించాలని, తిరిగి help చేయాలని,  
కనీసం గౌరవించాలని.., ఒక false alarm on చేసుకుని కూర్చుని ఉంటుంది మన అంతరంగం!
చాలా సందర్భాల్లో మనం నిరాశ పడే ప్రవర్తనే ఎదురవుతుంది...
దాంతో ఇక ఒక సంఘర్షణ మనలో రాజుకుంటుంది.
అది మన మహానీయతలను రూపు మార్చి మహత్వ కాంక్షలుగా మార్చేస్తుంది.
మన అవున్నత్యం, అవుదార్యాలు గ్రాఫ్ లో కిందకు పడిపోతాయి.
మన మనస్సు, అంతఃమనస్సు...తద్వారా మన శరీరం...సర్వ నాశనం అయిపోతాయి!

ఒకరికి help చేయడం ఎందుకూ మనం నాశనం కావడం ఎందుకూ అనిపిస్తుంది!
అలాగని అవసర పరిస్థితుల్లో మనం తప్పుకుని పోలేము.
మరి ఏమిటి కిం కర్తవ్యం?
...ఒక చేత్తో చేసింది ఇంకో చేతికి తెలియకుండా ఉండటమే....
దానం చేయడంలోని రహష్యం!
అది డబ్బయినా, ప్రేమయినా, సేవయినా, స్నేహమయినా, సహాయమయినా...
నీ హృదయంలో యే రకమయిన ప్రతిఫలమూ ఆశించకుండా ఉండేట్లయితే..నే...చెయ్యాలి!

సరే.., 
జీవితంలో తెలియనప్పుడు ఎన్నో జరుగుతుంటాయి....
ఇప్పుడు తెలిసింది కదా జాగ్రత వహిద్దాం...అనుకోవచ్చు.
కానీ, మరచి పోతాం. అదే మహత్వ కాంక్ష యొక్క తీవ్ర స్వభావం!
ప్రపంచంలోని కోట్లాది మందిమి ఈ కాంక్ష కోసమే ఏదైనా చెయ్యడానికి...ఎగబడతాము!
మన ego అనుకున్నట్లు అన్నీ సవ్యంగా reflect అయితే happy!
కానీ, ఇలా తేడా జరిగినప్పుడు మాత్రం మహత్వ కాంక్ష యొక్క అహం దెబ్బ తింటుంది...
అప్పుడు దానికది చేసుకునే గాయం... దానికి కాదు, మనకు గాయమవుతుంది!
ఇది గుర్తించినా దీన్ని జయించడం కొంచెం కష్టమనే అనిపిస్తోంది.
మరి, గుర్తించ లేకుండానే ఉంటే...అమ్మో!

ప్రకృతి యొక్క sharing స్వభావాన్ని అర్థం చేసుకుంటే తప్ప...
మనం ఇచ్చి- పుచ్చుకునే సిద్దాంతాన్ని ఒంటబట్టించుకోలేము!
ఒక సారి ఆ awareness వచ్చాక...
వచ్చాక కూడా మళ్లీ అవే పరిస్థితులే ఎదురవుతాయి...
So, awareness పట్ల awareness అలవరచుకోవాలి...
లేకపోతే ఒక సారి బాధ పడ్డట్లే మళ్లీ, మళ్లీ బాధ పడాల్సి వస్తుంది నాలా!

విశ్వం నాకు ఇంతకు ముందే ఇలాంటి ఓ అనుభవాన్ని ఇచ్చి ఉన్నా,
నేను ఆ విషయాన్ని మరచిపోయి మళ్లీ మహత్వ కాంక్షలో ఇరుక్కున్నాను.
కాలేజీ రోజుల్లో...
Jessica Jasmine - నా badminton co-player.
Situation: Jessi exam fees కట్టాలని ఏడుస్తోంది...
Purpose: Jessi 1st year fail అయిన subs గురించి వాళ్ల ఇంట్లో వాళ్లకు తెలీకూడదు. 
Me: Love Jessi...so help Jessi
Action: హాస్టల్ ఫీజు కట్టాల్సిన డబ్బుతో Jessi exam fees కట్టా.
Reaction: Ten daysలో adjust చేస్తానన్నది కాస్తా...Exams అయిపోయినా ఇవ్వలేదు.
Reflection: Hostel fees కోసం నాన్నతో classగా తిట్లూ...
అమ్మతో massగా తన్నులు తినాల్సి వచ్చింది.
Struggle: Dad సెలవల్లో weekly ఒక letter రాయించేవారు జెస్సీకి.
"ఇంకా adjust చేయలేక పోతున్నాను.. కానీ ఎలాగైనా నీ డబ్బు ఇచేస్తాను...
నా రక్తం అమ్మి అయినా నీ ఋణం తీర్చుకుంటాను!"(literally!)
అని జెస్సి ప్రతి ఉత్తరానికీ ప్రత్యుత్తరం...
Dad వదలడు - Jessi పలకదు!
అనవసరంగా help చేశానన్న బాధ, కోపం, వివశత, విద్వేషం!
Jessi డబ్బు ఇవ్వనే లేదు!! ( ఇప్పటికీ)
Dear Jessi, still I miss you!

అలా... ఒక స్వయం విద్వేషపు బాధను నేను మరచి పోయాను...
మళ్లీ ఇంకో అమ్మాయికి ఇంకో పెద్ద help చేసీ, నా మహత్వ కాంక్షలో నేను ఇరుక్కున్నాను!
ఏమో...చిన్న - చితకవి, మరచినవీ...ఇలాంటివే ఇంకా ఎన్ని అనుభవాలను నేను  మరచిపోయానో తెలియదు!
But, today I realize!
మళ్లీ మరచి పోకూడదని బలంగా అనుకుంటున్నాను...
పంచడం గురించి కాదు, పంచిన దాన్ని ఎంచడం గురించి!
నేను చేశాననుకోవడం కన్నా, నా వంతుగా జరగాల్సింది జరిగిందీ...
అనుకోవడం.., మనకు మనమే చేసుకునే గొప్ప సహాయం!
ఎందుకంటే మనిషన్నాక ఏదో ఒకటి...ఎవరికో ఒకరికి...ఎప్పుడో ఒకప్పుడు...
దానం...చేయక తప్పదు!

Thursday, September 15, 2011

Amazing pictures of the largest cave in the world..!


Photograph by Carsten Peter
A Journey to the soles of our land that we do not know...
Often associated with the word "cave" in our minds... 
The darkness, bats and other horrible things. 
But these specifications do not apply at all to the cave Hang Dong Sun, 
which has become the largest cave in the world!
This spectacular cave is so large 
that it contains within it a vast forest and the River Gary!!
The exciting thing is that humidity inside the cave is so high 
that condensation leads to the formation of what 
looks like clouds in the sky of the cave!!

The 5th photo of the landscape gives a hint of what is happening... 
The whole landscape is limestone, 
but much of it has been "dissected" leaving the 
planar surface of (essentially) mud between relict mountains of the limestone. 
Rivers that originally ran across the landscape 
above the mountain tops gradually took 
fault- and joint-controlled routes to lower levels 
as the landscape rose, or sea levels fell, 
eventually leading to carving very large cave systems... 

Tuesday, September 13, 2011

నా సమాధానం!

ME: 
WORDS can not describe EMPTINESS.
WORDS are... SHASTRAS, GEETA, KURAN, BIBLE.
EMPTINESS is like freshness of this morning....
Chirping of birds...
Beauty of rising sun...
Like the flowers smiling in a dirty water...
EMPTINESS IS OUR NATURE..,
...LIKE THE NATURE OF A CHILD.

Mr A: 
very Good .., that emptiness is God! I love emptiness so much..its my God and religion. Emptiness is our real nature...it must be everyone religion! ...Then self realization will happen, realizing one's emptiness is self realization.

ME: 
Shunyam = Aakasham = Emptiness = Universe-Space = God + Me = You = Every one....

Mr A: 
but most people won't believe it..they will criticize seriously...but once they taste the emptiness they will agree with us

ME: 
yaa, but every one of us experienced it unknowingly...,
once people realise in to consciousness...they dnt agree this...
they say...."haa, nothing is like that....I know everything... ' its just abt Ego....

Mr A: 
Actually its a luck to feel this void...I think a force from our past life is needed.

ME: 
yaa off-course...but, its just an attempt, DECIDERS FATE..!

Mr A: 
yeah...and one must find a right master or he must guide himself ( but its really hard )

ME: 
Meditation N Being wid nature...these two are best ways to lead EMPTINESS

Mr A: 
Meditation must change with time..at that time a master is needed... for example....as man civilize the effect of om meditation decreases..at that time a master is needed ... but if we can't find a master we must ready to take that risk.

ME: 
Yaa, but most of times we guide ourselves...

Mr A: 
yeah, and we must find good companions too if we can find

ME: 
Within yourself
Is a stillness, a sanctuary
To which you can retreat at any time and be yourself.

Mr B: 
According to Science, there is no emptiness at all in this infinite world. In everywhere, everything is made up of matter and its changing continuously. Nature has an immense diversity. Man explored physical, chemical and biological aspects of nature. Man only invented agriculture and industry; science and art; navigation and aviation; beauty and aesthetics; morals and ethics; and what not... If man had felt emptiness in this world, nothing would have been invented. Conversely, man had felt full of diversity in the nature and explored it and built up gigantic civilization. So, I cant dare to say that emptiness is our nature, after all, Nature is full of diversity. Sorry to say this...

Mr A: 
why u are saying science here ?? This is totally a different thing that your science can't even imagine... if u want some proof u must come to our laboratary...there we can give u proofs and explanations.

Emptiness and enlightenment are not something that can be proved with the help of science......The emptiness or the Sanskrit word shoonyatha or the Void means the supreme consciousness from which all things are born including earth...science is just a small kid in this field....This thing can be proved only in our spiritual laboratory that's our heart.... For every scientific experiments we need apparatus..like for every spiritual experiment we need specific apparatus..... One of the apparatus is trust another one is love and another one is peace.... and there is one and only one formula ..its the meditation.. If u are ready to do this practical in this way u will find... If u are trying to find it with your materialistic science u will not find.. You will simply criticize....we will lose nothing because we know the immense joy that we get from void..
Only u will miss it..! We don't want science to explain these things...because we already know it! ...a spiritual seeker don't want any proof from a well known scientist.... The proofs from a scientist will be very honorable in the ordinary world...but for us it is not.

Mr B: 
Truth is the only criteria to believe anything for human beings. Since long, whatever invented by Science that is nothing but the truth.., Which was accepted unanimously by men all over the world. Truth must be always concrete not an abstract. 
Whatever spirituality preached, that was always abstract and men couldn't find any unanimity in spiritual preachings. 
Supreme consciousness means nothing but the complete awareness of the changes which continuously happening in human thinking, society and nature, according to science.

Mr A: 
Supreme consiousness is not human consiousness its the creator of the universe. Spirituality begins from where the mind ends.... You are always saying about thoughts..these thoughts belongs to mind... mind can't understand this complete consciousness.

ME: To Mr B...: 
Do meditation even once .., even you find a little truth youeself....off-course... Meditation is not a way of making your mind quiet. It’s a way of entering into the quiet that’s already there buried under the 50,000 thoughts the average person thinks every day.

But.., 
శబ్ధం లోనే నిశబ్ధం ఉందన్న సంగతి నీకు Meditationలో తెలుస్తుంది. అప్పుడు భౌతిక రూపం నుంచీ Cosmic రూపం వరకు వివిధ రూపాల్లో ఉన్న, పదార్ధం యొక్క శూన్యత్వం గురించి నీకు ఒక ఊహామాత్రపు  స్పృహ కలుగుతుంది. నువ్వు ఇలా శబ్ధం లోని నిశబ్దాన్ని, నిశబ్ధం లోని శబ్దాన్ని మార్చి, మార్చి వినగలిగితే....మనం నిశబ్ధంలోనే, శూన్యం లోనే ఉన్నామని తెలుస్తుంది. 
{ దీన్నే నాదోపాసన అంటారు యోగా లో.} 
శరీరంలోని ప్రాణాన్ని, గాలినీ చేత్తో పట్టుకుని చూపించలేనట్లుగా...పదార్థం యొక్క "భ్రమ"లో కూరుకుపోయిన విజ్ఞానానికి ఏ జ్ఞానమూ శున్యంని చూపించలేదు. 


ఇక Scientificగా...
ఏదైతే వివిధ రూపాల్లో MATTER ఉందో అది మధ్య మధ్యలో శూన్యాన్ని కలిగి ఉంటుంది. అణువుల మధ్య, పరమాణువుల మధ్య.., ఎలక్ట్రానుల మధ్య, ప్రోటానుల మధ్య, న్యుట్రానుల మధ్య కూడా....కదా.., నిజానికి Matter మధ్య శూన్యం లేదు. శూన్యం మధ్య అక్కడక్కడా Matter ఆక్రమించబడి ఉంది. సత్యమేంటంటే....శూన్యం కూడా పదార్ధం యొక్క మరియొక రూపం. అదే పదార్ధం యొక్క "తొలి రూపం"! 
కాంతి, విద్యుత్తూ, ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, ఇంకా... మనకు తెలియని, కనిపెట్టాలని ప్రయత్నిస్తున్న శూన్య రూపపు పదార్ధం! అదే శూన్యం!! 
అటు Scientistలు ఇటు Spiritualistలు దాన్ని కనుక్కోవడానికే Researchలు చేస్తున్నారు....మీరు Science Studentఆ? .., Einsteinని చదవండి. Quantum Physics గురించి Study చేయండి.

నా ఉద్దేశ్యంలో నిజానికి....
దేవుడు, భగవంతుడు, పాపం - పుణ్యం అనేవి......మానవుడి బలహీనత, అసంపూర్ణ సమాజపు నిర్మాణము, కొంతమందిని కొంతమంది అణచి పెట్టుకోవాలన్న అధికారిక భావముల తయారీ తప్ప ఇంకేమీ కాదు. 
X+Y.., A+B అంటూ Scientificగా, Mathematicalగా మనం use చేసే Symbols ఎలానో,...అలాంటి Spiritual Symbolsయే మన "దేవుళ్లు"! 
నాకు నా Symbols వెనుక ఉన్న formulaలు తెలుసు..!
నాకు సంబంధించినంత వరకూ ఇప్పుడవి.., ఇతరులకు కూడా అర్థమయ్యే దానికి Use చేసే words మాత్రమే!  
TRY IT..!

ఇది నా సమాధానం!
ఇది నేను ఇచ్చే సమాధానం!
ఇది...నాకు నేను ఇచ్చుకునే సమాధానం!
నిజానికి...ఇది, నేను వేసుకున్న ప్రశ్నకు నేను ఇచ్చుకున్న సమాధానం!!
సత్యం కొరకు, రహష్యం కొరకు ఎవరి ప్రశ్న వాళ్లే వేసుకోవాలి!
ఎందుకంటే....ప్రతి ఒక్కరూ నిలబడ్డ చోటునుండీ... వేరు వేరు మార్గాల్లో సత్యం చేరుకోబడుతుంది!

మీ ప్రశ్న మీరు వేసుకోండి...
మీ సమాధానం మీరే తెలుసుకోండి!!
మీ మార్గాల్లో మీరు నడవండి...
మీ సత్యం మీరు కనుక్కోండి...
మీ దేవుణ్ణి మీరు ఆవిష్కరించుకోండి...
మీ విశ్వ రహష్యాన్ని మీరు ఛేదించుకోండి!
మీ జీవితాన్ని.., మీరే జీవించండి!!


Saturday, September 10, 2011

... Law Of The Seed!


ఒక చెట్టు నాటాలంటే... పది విత్తనాలు నాటాలి.
ఒక తోట పెంచాలంటే... 
చెట్టుకు పది విత్తనాల లాగా వందల విత్తనాలు నాటాలి!
అలా నాటితే, అప్పుడు యించు, మించు మనం అనుకున్నన్ని చెట్లు మొలుస్తాయి. 
ఉదాహరణకు మనం వెయ్యి విత్తనాలు నాటామానుకుంటే...
వెయ్యి మొక్కలు మొలవాలి, కానీ అన్నీ మోలుస్తాయా!? 
మొలవవు! వాటిలో కొన్ని నిర్వీర్యమవుతాయి.
దాంతో...ఓ సగమో, పావో మొలకెత్తుతాయి.
అంటే వెయ్యి నాటితే 500లో, వందో మొలకెత్తుతాయి. 
అంటే వంద చెట్ల కోసం వెయ్యి విత్తనాలను నాటాల్సి వచ్చిందన్నమాట! 
వందకు వెయ్యి నాటడమెందుకు??
వంద మాత్రమే నాటితే సరిపోదా? సరిపోదు! 
ఎందుకంటే ఆ నాటిన వాటిలో మళ్లీ సగమే మొలకెత్తుతాయి కనుక. 
మన జీవితం కూడా ఈ తోట లాంటిదే. 
మనం వేసే ప్రతీ అడుగు ఒక విత్తనం లాంటిదే. 
ఒక చెట్టు రావాలంటే పది విత్తనాలను నాటాలి. 
....లా ఆఫ్ ది సీడ్!.... 
...ప్రకృతి యొక్క ఈ సూత్రం తెలుసుకుంటే... 
మనలో నిరాశా నిస్పృహలు ఉండమన్నా ఉండవు. 
ఒక విజయం రావాలంటే పదిసార్లు ప్రయత్నించాల్సిందే. 
ఒక ఉద్యోగం సంపాదించాలంటే పది ఇంటర్వ్యూలకు అటెండ్ కావాలి. 
Even, ఒక మంచి ఉద్యోగిని ఎన్నుకోవాలంటే పది మందిని ఇంటర్వ్యూ చేయాల్సిందే. 
చివరకు ఒక చిన్న వస్తువు కొనడానికి పది షాపులు తిరగాలి.
ఒక్క డ్రెస్ కొనడానికి నాలుగు ట్రయల్ వేస్తాం.
అంతే కానీ ఇలా ప్రయత్నించగానే అలా విజయం రాదు.
So విజయం రావడం లేదని ప్రయత్నించడం మానేయకండి.
.... Law Of The Seed....Try and try AGAIN!

Monday, September 5, 2011

My Masters

My Masters:
నా జీవన మార్గాన్ని నిర్మించిన శ్రామికులు... / My Masters...
నా జీవన ప్రయాణంలో వారు పరిచయమైన వరుస క్రమంలో...
Descriptions: వారిని నేను అన్వయించుకున్న అవగాహన మేరకు మాత్రమే Describe చేశా!


Sremati Y. Lakshmi Devi - My MoM
నా జీవితంలో అత్యంత కఠినంగా శిక్షలు విధిస్తూ.., శిక్షణనిచ్చిన తొలి గురువు!
అమ్మ శిక్షణ వలన... జీవితంలోని ఎంత కఠినతరమైన పాఠాలైనా, సులభంగా దాటవేయగల శక్తి వచ్చింది. 

Dr. V. Yella Reddy - My DaD 
అరటిపండు వలచి నోట్లో పెట్టినంత సులభంగా జీవిత పాఠాలను నేర్పారు.
వెన్నెల చలువను, తేనె తీపిని, అమృత భాండాగారం లాంటి ప్రేమను పంచారు...
చేదు విషాలను, సూర్యుని తాపాలను స్వయంగా face చేసే అవకాశాలను... మాకే వదిలేసిన నిగర్వి. 

Swami Shivananda - Rusheekesh 
Never forget Pranayamam - Never forget Yoga!
Bear Insult and Bear Injury! 
Telepathi, hipnotism, Nadee swara Sadhana లాంటి ఎన్నో 
మానసిక, ఆత్మిక విద్యలను ఆయన బోధనల ద్వార నేర్చుకున్నాను. 

Jesus Christ 
ప్రేమ, నమ్మకం, విశ్వాసం, మార్పు - స్వస్థత!
తప్పులు చేసిన పిల్లలను క్షమించడానికి మన తండ్రి అయిన దేవుడు... 
ఎదురు చూస్తున్నాడన్న సత్యాన్ని, పాశ్చ్యాత్తాప మార్గాన్ని బోధించిన కరుణామయుడు! 

BhagavadGita
మానవ జీవితం యొక్క సకల ధర్మాలను, సర్వ సుఖాలను, 
జీవన సులభాలను, మనిషి పరమార్థాన్ని అరహష్య పరిచే మహా గ్రంధం!
స్థల, కాల, పరిస్థితుల నిమిత్తం లేకుండా విశ్వం ఆద్యంతం వ్యక్తమయ్యే దివ్య సాధనం!! 

Lord Krishna
BhagavadGita వంటి మహా ధర్మాన్ని ప్రవచించిన ఆచార్యుడు!
మానవ మహాభారతాన్ని... సకర్మ బద్ధంగా సంభవం చేయడానికి అవతరించిన విశ్వైక స్వరూపం!! 

Swami Vivekananda
Love one and all - Serve one and all...
విశ్వ సౌభ్రాతృత్వాన్ని విరచించిన స్పురధ్రూపి.
ఇనుప ఖండరాలు, ఉక్కు నరాలు కలిగిన వెయ్యిమంది ఆధ్యాత్మిక యోధులను తయారు చేస్తే చాలు...
వాళ్ళే ఈ ప్రపంచాన్ని సమూలంగా మారుస్తారని సంకల్పించిన ఆధ్యాత్మిక యోధుడు! 

Sree Potuluri Veera Brahmendra Swami
ఆధ్యాత్మిక శోధనలను, భక్తి భావనలను ఉధృత ప్రచారం చేసిన తత్వ శాస్త్ర వేత్త.
భవిష్య ఊహలను పరిశోధించి, బాధా పరిహారాలు విప్పి చెప్పిన మహా జ్ఞాని!
ఆయన విరచించిన కాల జ్ఞానం ప్రపంచానికి ఎప్పటికీ ఒక దిక్సూచి!!

Bhagawan Sri Satya Sai Baba
ప్రేమ, సేవలు రెండూ... ఆధ్యాత్మిక సాగరాన్ని దాటించే రెండు తెప్పలని 
Practicalగా నిరూపించిన ఆధునిక యోగి! మార్గ దర్శి!! 

Sri Shiridi Sai Baba
శ్రద్ధ, సబూరి సాయి సూత్రాలు.
నేర్చుకున్న వారికి నేర్చుకున్నంత జ్ఞానం ఇచ్చే  దైవం.
సాక్షాత్ ఆది గురువు దత్తాత్రేయుని అవతారం!
సాధకులకు ఎన్నో రకాలుగా, వారడిగిన రీతిలో ఆధ్యాత్మిక, లౌకిక మార్గ దర్శనం చేయించే మహా గురువు!

Albert Einstein
అభౌతిక - అది భౌతిక - భౌతిక శాస్త్రాల సరిహద్దులు చెరిపేసిన Great Scientist!
Science పితామహుడు!

Lord Buddha
శాంతి, అహింసలను ఆవిష్కరించిన ఆధ్యాత్మిక మహా జ్ఞాని.
మానవ ఆధ్యాత్మిక శోధనలలోని ఎన్నో మూఢ విశ్వాసాలకు ముగింపు చూపిన గురువు.
బౌద్ధ మత సంస్థాపకుడు. 

Steven Spielberg
Hollywood Film Director
సృజనాత్మక, సాంకేతిక అంశాలకు, 
సరి కొత్త science ఊహలకు తెరపై జీవం పోసిన సినిమా బ్రహ్మ! 

Dr. Dasari Narayana Rao
తెలుగు సినిమా దిగ్ధర్శకుడు.
కొంచెం సినిమా వైపు కాళ్ళు నడిచే ప్రతి హౌత్సాహిక సినిమా జీవికీ తెలిసో, తెలియకో గురువు!
కథ, కథనంలకు కొత్త నడకలు నేర్పిన డైలాగాచార్యుడు! 

Dr. Samuel Hahnemann 
Homeo vaidya pitaamahudu!

Dr. Sigmund Freud
ప్రపంచ ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్త.
మనుష్యులను రెండు భయంకర భావాల నుంచి రక్షించిన మానస బ్రహ్మ. 

A Secret Book
కుండలినీ సాధనకు సంబంధించిన ఒక మార్మిక గ్రంధం!

Master subhash patriji
Pyramid Dhyana Kendra Vyavasthapakulu...
ఎన్నో మానసిక, సూక్ష్మ, అంతర, ఆధ్యాత్మిక సాధనలు పరిచయం చేసిన ధ్యాన యోగి!

Sri Praja Pita Brahma Baba
బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయ సంస్థాపకులు.
రాజ యోగ ధ్యానం!

Me, Myself 
నన్ను నేను పరిశోధించుకున్న  క్షణాలు...
జీవుతానుభావాలు...భవిష్యత్ యోచన!

Sri Paramhamsa Yogananda Swami
ఈ "ఒక యోగి ఆత్మ కథ" కోట్ల మంది జీవితాలను మలుపు తిప్పింది.
ఆ కోటిలో నేనూ ఉన్నానని నమ్ముతున్నాను!

Sri Maha Avatar Baba!


Sri Poornananda Giri Matha
గరు ముఖతా కుండలినీ దీక్ష ఆవశ్యకతను తెలిపి,
దీక్షను అనుగ్రహించి...సాధన పర్యవేక్షించిన గురువు!

Goddess Gayatri
గాయత్రి మంత్ర సాధన...
అద్భుత జీవన ఫలాలను అందించిన క్షణాలు...

Osho
అనంత జీవన సారాలన్నీ ఈ సాగరంలోనే, 
నేర్చుకుంటూ....ఉన్నాను!

Chalam
స్త్రీగా నన్ను సంపూర్ణం చేసిన స్త్రీ ప్రేమికుడు! 

Kaata Sekhar Reddy 
My Journalism Teacher
బయటి ప్రపంచంతో నాకు communication, connectivity కలిగించిన గురువు.
Exploration!



Master Sudhakar Garu
My Reiki Master.
నాకు ఊహ  తెలిసినప్పట్నించీ నేను ఎదురు చూసిన విద్యను, 
నాకు ఎదురుగా తీసుకువచ్చి, ఎంతో సమగ్రంగా నేర్పించిన గురువు!

Reiki Masters
Master Mikao Usui gi - 1865 - 1926
Master Chujiro Hayashi  - 1880 - 1940
Master Hawayo Takata - 1900 - 1980

Guru Viswa Spoorthi 
A Scientific Saint!
ఆధునిక Science inventionsకు దీటుగా, 
ఆధ్యాత్మిక ప్రపంచాన్ని Scientificగా నిరూపణా సమేతంగా ఆవిష్కరిస్తున్న...ఆధ్యాత్మిక శాస్త్రవేత్త! 

Mahaa Avatar Baba.., Again......
మనం మరచిపోయినా మనల్ని మరచిపోని వాళ్లే గురువులు!
మనల్ని తీర్చిదిద్దడమే వారి లక్ష్యం!
అందుకే ఆ కరుణామయుడు, ప్రేమ మూర్తి,...మహావతార్ బాబా మళ్లీ వచ్చాడు!
శిక్షణకు మనం యోగ్యులమయ్యేదాకా వారు వేచి చూస్తారు.
పరీక్షిస్తారు, మార్చేస్తారు మన జీవన రీతులను, నేర్పిస్తారు ముముక్ష విధానాలను!