Sunday, August 29, 2010

పండు పాటలూ, కాయ పాటలూ

లాలి పాటలూ, జోల పాటలూ
పొలం పాటలూ, పెళ్లి పాటలూ,
జనం పాటలూ, దేవ గణం పాటలూ...
....పనితో పాటు పాట.. మనిషి జీవితం లోని
సగం భాగాన్ని పాలుపంచుకుంది.
ఇక, సహజంగానే అన్ని విషయాలనూ
ఆక్రమించుకున్న సినిమాలు...
పాటను పూర్తిగా దారాదత్తం చేసుకున్నాయి.
నవ రసాలు ఎన్నున్నా... స'రసా'నిదే...అగ్ర తాంబూలం!
అంతే మరి. పనిని, బాధను మరచిపోవడానికి పుట్టిందే పాట.
మనిషికి ఏవి ఆనందాన్ని ఇస్తాయో అవే నచ్చుతాయి.
...మొదట్లో తోటల్లో వీణలు మీటుతూ పాటలు పాడిన సినిమాలు ...
....ఇప్పుడు...ఫారిన్ టూర్లు చేస్తున్నాయి.
బాఉంది.. సినిమా టికెట్టు మీద విదేశీ తీర్థ యాత్రలు...
వయ్యారి హంస నడకలు, కారులో షికారులూ
చిటపట చినుకులూ, చిరు చిరు అడుగులూ...
ఉరుకులూ,పరుగులూ..కూచిపూడి కులుకులూ,
జాక్షన్ స్టెప్పులు...బ్రేకులు, షేకులు...

...ఇలా...ఒక రాగం కాదు, సినిమా పాటలు ఎన్నో శ్రుతులు మీరి పోయాయి.
...పండు పాటలూ, కాయ పాటలూ...
ఇవేంటి పొలం పాటలూ, జనం పాటలు లాగా
అనుకుంటున్నారా, తొందర పడకండి,
...పండు పాటలూ, కాయ పాటలూ
ఆకు పాటలూ, పూలపాటలూ
ఇప్పుడు లేటెస్ట్ గా
కొబ్బరి చిప్పల పాటలు...
ఆ..హా.. మనం తినే పళ్ళల్లో, పెట్టుకునే పూలల్లో ఇంత ఉందా!
అని జనం తలకిందులయిపోయారు...
తలలో పూలు పెట్టుకుని మురిసిపోయే అమ్మాయిలు...
పోనీ టేఇల్లు, పొట్టి క్రాఫ్ లకు వచ్చారు
(జడలు వేసుకున్నా, ఎందుకో...కానీ, పెళ్ళిళ్ళు పెరంటాలప్పుడు తప్పా,
బయట ప్రపంచంలో పూలు పెట్టుకునే సాహసం చేయలేకున్నారు అమ్మాయిలు.
నేను కూడా! )
...అయినా ఈ పల్లూ, పూల కాన్సెప్ట్ బాగా నచ్చింది అమ్మాయిలకు.
( ఓ పాతిక మంది అమ్మాయిలను కూపీ లాగాను...అందరికి ఎంతో కొంత,
ఈ పాటలంటే క్రేజ్ గా ఉంది.)

ఎంత క్రేజ్ గా ఉన్నా,
లైట్సు, కెమెరా లేకుండా
అంత రిస్క్ ఫీఇట్సు చేయడం అనవసరం కదా!
....అయినా, ఈ పూలు, పండ్లు
ఉన్గరాలూ, బొన్గరాలూ
గొడుగులు, గోపురాలూ
కోళ్ళు, కుక్కలూ
సినిమా వాళ్ళ సోత్తైపోయాయి (సెట్ ప్రోపర్తిస్)
వాళ్ళ పాట్లేవో వాళ్ళు పడీ,
నాలుగు పాటలు మనకు చూపించక పోరు...
అని మనసులు కుదుటపరచుకున్నారు.
ముఖ్య గమనిక: ఎంతైనా ఈ పూలూ, పండ్లూ వద్దనుకోల్యేం. ఎందుకంటే ... అవి బాఉంటాయి మరి!
పూలూ పండ్లూ, ఆ పాటలూ అన్నీ బాఉంటాయి . కాక పొతే ...
యూత్ దగ్గర సాంగ్స్ సీఇంగ్ కు టైం లేదనుకుంటున్నారో
ఏమో గానీ ...ఈ మధ్య
....100 k.m స్పీడ్తో పరుగెట్టిస్తూ...
అండర్ వాటర్ లో స్విం చేయిస్తూ
డ్యుయల్ గా జిమ్ చేయిస్తూ
నాలుగు యోగాసనాలు చేసి చూపిస్తే చాలనుకుంటున్నారు కొందరు....
ఈ ఫిట్నెస్ ఎక్షిబిసన్ ల కన్నా కాయ పాటో పండు పాటో కంటికింపుగా
ఉంటుందనేది కాదనలేము!...
....డ్యాన్స్... ఆత్మలో చెలరేగే ఆనందం అలలతో పాటు
తనువూ, మనసూ ఉర్రూతలూగే సహజాతం.
ఒకరు డ్యాన్స్ చేస్తున్నారంటే...చూసే ప్రతి ఒక్కరి హృదయాలు
ఆనందతాండవం చేస్తుంటాయి.
ఆటా, పాటా ఆ విధంగా అనాది నుండీ మనిషి జీవితం తో పెనవేసుకుపోయాయి.
పాట పాడుతూ పని చేసుకుంటాము
పనిచేసుకుంటూ పాటలు పాడుకున్టాము,
అందుకే పనీ,పాటా అంటాము జంటగా!
చివరకు ఇలా జరిగిందన్న మాట!..
...పనితో పాట జత కట్టినట్లు...కాయా, పండు జత కట్టి...
సినిమా పాటల్లో ఆడుకుంటున్నాయి!
(...ఫైనల్ గా.... ఈ పూలూ, పండ్ల కోరిక ఇంత వరకూ తీరనే లేదు.
తినేటప్పుడు గుర్తుండదు... గుర్తొచ్చేసరికి... తినేసుంటా! హ హ హహ...
పాటలు మాత్రం ఎప్పుడూ వింటూ ఉంటా...)

Wednesday, August 25, 2010

అలుపెరుగని బాటసారిని

రచయితకు వయసుండకూడదు 
అప్పుడే రచనకు కూడా వయసుండదు!
 
కాలంగీతలను నా కన్నె మోము మీద గాట్లుపడనివ్వను 
కాలచక్రం ముందుకురుకుతుంటే
ఏ అలుపూసొలుపూ లేకుండా దాని వెంటే ... ముందుకూ, అవసరమైతే వెనక్కూ పరుగెడుతుంటాను. 
అలుపెరుగని బాటసారికి ... అంతుచిక్కని గమ్యాలే బలం! 


ఈ...
చీమలు దూరని చిట్టడవి
కాకులు దూరని కారడవి ప్రయాణం... నాకెంతో ఇష్టం!
మనిషి మస్తిష్కం లోనే ఉంది విశ్వం సమస్తం!!
ఎన్ని వేల నాడులున్నాయో
ఎన్ని లక్షల కణాలున్నాయో
ఎన్ని కోట్ల న్యూ రాన్ లున్నాయో...
కోట్ల మనుష్యులు, కోట్ల న్యూ రాన్ లు= కోట్ల ఆలోచనలు ..
... రహస్యాలే లేవు, ఉన్నదంతా బట్ట బయలే!
గుట్టు విప్పే చిట్టాల కోసం వెదుకుతుంటే
దొరికిన చిట్కాలు కొన్ని నా దగ్గరున్నాయి.

... ఈ ప్రయాణంలో మనం 
కీకారణ్యాలు దాటాము కానీ
ఉద్యానవనాలలో చిక్కుకున్నాము

...ఏడేడు సముద్రాలూ దాటిన నిపుణుడు.. 

మురికి కాలువలో కాలు జారి పడినట్లు...
... మనం సముద్రాలను అలవోకగా సాధిస్తాము కానీ
పిల్లకాలువల ముందు పిరికి వాళ్లమవుతాము.

అడవిలోని ఆకునైనా, సుడి తుఫానులోని పడవనయినా,
నడిచే మనిషినయినా, నడిపించే మనసునయినా
కాలమై పరుగులు తీసే అరణ్య అర్ణవాలెన్నైనా 

అలవోకగా దాటించి తీసుకు వెళ్తాను.. అనంతాలలోకి!
మీ కాలంతో నాకు పని లేదు
భూత, భవిష్యత్, వర్తమానాలు ... 

ఎప్పుడయినా సరే
నాతో రండి
మిమ్మల్ని ఈ తోటల బాటలు దాటిస్తాను!


...ఎందుకంటే నేనేమో అలుపెరుగని బాటసారిని, 
విశ్వమేమో నిత్యనూతన అణువూ, తరంగాల (Particles And Waves)సృష్టి విస్తరణా స్థలం... 


Sunday, August 22, 2010

మజ్నూ కథ


(పొద్దు పోక టైం పాస్ కు పాత సినిమాలు చూస్తున్నప్పుడు
గుర్తుకొచ్చిన సంగతులు ...)
(....కొత్త సినిమాలు స్టాక్ లేవు ... )
బా..గా చిన్నప్పుడు...
...పిన్ని & బ్యాచ్ తో కలిసి
మజ్నూ సినిమాకెళ్లాను
మాయ్య తెగ నచ్చేశాడు!
ఏయ్ నీకు బాబాయి అవుతాడు/ అన్నారు పిన్నీవాళ్ళు లా... మాయ్య
కాదు బాబాయి
మావయ్యా మావయ్యా ...
చూడూ , మాకు మావయ్యే నీకూ మావయ్యే అంటే ఎలా ?!...
అంది బ్యాచ్ లో చిన్న పిన్ని
చాక్లెట్లు, మళ్లీ సినిమాకు తీసుకు వెలతామూ లాంటి అపాత్ర దానాలతో
బేర సారాలు మొదలెట్టారు...
అంతమన్దీ పట్టు పట్టి అడుగుతున్నారంటే ...
మాయ్యను వదులుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదనిపించింది
ఏం చేయాలని ఆలోచిస్తుంటే...
చందమామను అన్దరూ మామా అనడం గురించి నాన్న చెప్పిన కథ గుర్తొచ్చింది
...చందమామ అందరికీ మామే కదా అలాగే మజ్నూ కూడా మనందరికీ మాయ్యే ...చప్పున చెప్పీ వచ్చేశాను అక్కన్నించి .
..... ఇంట్లో ఒక్క దాన్నే ఉన్నాను ...
అమ్మెక్కడో పనితో కుస్తిపడుతోంది
నాన్న హాస్పిటల్ కు (పేషెంట్ అనుకునేరు, ఆయన డాక్టర్ .) వెళ్లి పోయాడు
సిబ్లింగ్స్ ఎక్కడ చీమిడి చీదుకుంటూ ఉన్నారో...
ఎవ్వరూ లేరు...
ఓ.కే.. గొంతు సవరించుకుని గాట్టిగా పాడ్డం మొదలెట్టాను ...
...ఇది తొలి రాత్రీ ఆ..ఆ ఆ ..(అప్పటికి ఏ అర్తం పర్థం తెలియదు)
కదలని రాత్రీ ...( ఎందుకు కదలదూ? ఇటు వైపు పడుకున్న వాళ్ళం అటు తిరిగే సరికి
భళ్ళున తెల్లారుతుంది, స్కూలుకు టైం అవుతుంది.)
... నాకు నీవూ , నీకు నేనూ చెప్పుకున్నాకథల రాతిరీ ....
( అబ్బా భలే ఉందే కథల రాత్రంట... ఏ ముహూర్తాన అనుకున్నానో కానీ,
ఆ తర్వాత ఎన్నో రాత్రులు కథలు రాస్తూ గడిపేస్తుంటాను.)
ఈ లోగా అమ్మ వచ్చిందీ, ఏం పాటలే అవీ ఆడపిల్లలు పాడేటివేనా అంటూ
వీపు విమానం మోత మోగించింది!
(ఇప్పుడెన్నిలవ్ స్టోరీలు , రొమాంటిక్ సీన్ లు రాసినా, ఏమోనే మా కాలంలో, మన ఇళ్ళల్లో
అవన్నీ లేవు! అంటుంది. సీమ ప్రాంతానికి చెందిన లవ్ లైఫ్ గురించి మరేదైనా సందర్భంలో......)
.....అమ్మ కొట్టిందన్న బాధతో ఉన్న నేను...
రోడ్డు మీద మెల్లగా పిల్లిలా నడుచుకుంటూ స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నాను..
(బయట పులిలా తిరిగితే అమ్మ ఒప్పుకోదు. ఆడపిల్లలు పిల్లుల్లా మెత్తగా అణకువగా ఉండాలి..టా ?
ఆడపిల్లలు చూట్టానికి మెతగ్గా ఉండాలి, నిజానికి గాట్టి ధైర్యం ఉండాలి, అప్పుడే ఆడ జీవితం లోని
ఒడిదుడుకులు తట్టుకోగలమని చెప్పిందీ అమ్మే. అమ్మ నేర్పిన ఆ ధైర్యం తోనే... ఐ వోన్ మై పీపుల్ &
ఐ చేన్జేడ్ మై పీపుల్! అందుకే ఇప్పుడు మీ ముందు ఉన్నాను!!
సో అలా మనం ఇంట్లో పులి బయట మ్యావ్ ..పిల్లి! కామన్గా బోయ్స్ కు ఇది రివర్స్ లో అప్ప్లై అవుతుంది...
అవ్వక పొతే ...నేనొప్పుకోను . అవ్వాలి, అంతే!!)
...రోడ్డు మీద మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాను
ఏం తీశాడురా సినిమా 'దాసరోడు
అని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు కొందరు అంకుల్స్
...'దాసరోడా' ?! ( మా ఊల్లో పెళ్లిల్లప్పుడు గండ దీపం మోసే వాన్నిదాసరోడంటారు.ఆయన సినిమా తీశాడా...నాకేం అర్థం కాలేదు. )
పిన్నీవాళ్ళను అడుగుదామంటే ...
నా మాయ్యను కొట్టేస్తారని భయ్యం!

ఎవ్వర్నీఅడగకుండా నేనే ఫిక్స్ అయిపోయాను,
ఏమనంటే... మనూరి దాసరోడు సినిమా తీయగా లేనిది... నేను తీయలేనా...!!
ఆ రకంగా ఆయనెవ్వరో తెలియకుండానే
మహానుభావుడు దాసరి నారాయణ రావు గారికి
ఏక లవ్య శిష్యురాలిని అయిపోయాను. నాకు తెలియ కుండానే నా జీవితాన్ని మలుపు తిప్పిన... మజ్నూకథ ఇది !
ఆ తర్వాత మా ఇంటికి హిందూ పేపరోచ్చిన్దీ, నా జీవితం లోకి స్పీల్ బర్గ్ వచ్చాడు , అది వేరే కథ!
... తర్వాత ఉదయం పేపరొచ్చిన్దీ , దాసరి నారాయణ రావు ఎవరో తెలిసింది. . .
..... సినిమా కథలు... పండించడం నుండి పారిపోయి
వండడాన్ని కూడా వదిలేసి ,
ఆనియన్, టమోటా, క్యాబేజీ, చీజ్ లూ పూసి..
బర్గర్లతో సరిపెడుతోన్న
మోడరన్ కథకుల పాలిట కుల దైవం ఆయన!!
హాలిఉడ్ వాళ్ళ దగ్గర బొచ్చెడు అడ్వాన్సు టెక్నాలజీ ఉందని, మనకు లేదనీ...
ఆడ లేక మన మద్దెల ఓటిదని నిందలు మోపుతున్నాం!
పంట పండించడము, వండి వడ్డించడము నేర్చుకుంటే ...
డిష్ గార్నిష్ చేయడం పెద్ద సమస్య కాదు!

Sunday, August 15, 2010

దేశం మనదీ తేజం మనదీ.... ఎగురుతున్న జెండా మనదే!



దేశం మనదీ తేజం మనదీ....
ఎగురుతున్న జెండా మనదే....
సాయంత్రం నీరెండలో
టెర్రస్ పైన పాడుకుంటూ ఆడుకుంటున్నారు పిల్లలు.
ఇండిపెన్డేన్స్ డే సెలెబ్రేషన్స్...
ప్రతి టీవి చానెల్ లోనూ దేశ భక్తి గీతాల వెల్లువ.
........పిల్లలను పలకరించి ఇండిపెన్డేన్స్ డే గురించి వివరాలడిగా
ఇండిపెన్డేన్స్ గురించీ, వాళ్ళ వాళ్ళ స్కూల్స్ లో ఎలా సెలెబ్రేట్
చేశారనే దాని గురించీ చిలకల్లా చెక, చెకా చెప్పారు
పాటలను ఉత్సాహంగా పోటీలు పడీ పాడారు....
ఏ ప్రశ్నకైనా సమాధానం ఉంది వాళ్ళ దగ్గర
కానీ, దేనికీ మీనింగ్స్ మాత్రం తెలీవు!
సారే జహా సే అచ్చా, వందేమాతరం,
భాషేదైనా పాడతారు కానీ, భావమే తెలీడం లేదు!
హా...శ్చర్య పోవలసిన విషయము ఏంటంటే
భారత స్వాతంత్ర్య పోరాటం గురించి, దేశం గురించీ పక్కన పెడితే...
పర భాషా పదాలు తెలిసినంతగా తెలుగు తెలియడం లేదు!!
దేశం...అంటే  country ...అని చెబుతున్నారు,
మరి రాజ్యం అంటే...బిక్క ముఖాలు వేశారు.
ఈ లోగా ఇంకో గమ్మత్తైన విషయం జరిగింది.
పిల్లలకు దేశమంటే ఏంటి, రాజ్యమంటే ఏంటి చెప్పే లోగా ...
పదేళ్ళ నుంచీ పబ్లిషింగ్ రంగం లో ఉన్న ....    .... అంకుల్ వచ్చారు
'రాజ్యమన్నా దేశమన్నా ఒకటేరా' .....అన్నాడు
(నాతో పోటీ పడాలని ఆయనకు చాన్నాళ్ళ నుంచీ ఉబలాటం.)
హిహిహ్హి హ్హీ....ఏదో సాధించినట్టు వెటకారం నవ్వు నవ్వాడు.
( నాకూ నవ్వొచ్చింది కానీ ఫేస్ టు ఫేస్...వూహు)
ఈ లోగా ఇంకో నలుగురు, ఏంటి..ఏంటి అంటూ వచ్చి జాయిన్ అయ్యారు
....ఆందరూ ఒకటే మాట...రాజ్యమన్నా.. దేశమే!
అంటే కేవలం దేశం కు సినానిం గా వాడేదేనా రాజ్యం?!
మీనింగ్స్ పిల్లలకు తెలివనుకున్నాను.
కాదు, మనకు తెలిస్తే కదా వాళ్లకు చెప్పేదీ...
దేశం అంటే కొన్ని సరి హద్దుల మధ్య
కొంత మంది నివసించే భౌగోళిక ప్రదేశం!
రాజ్యం అంటే... రాజరికం.... అంటే పరిపాలన చేసేది.
....మన దేశం మన పరిపాలనలో ఉంటే,
ఆ స్వతంత్ర దేశాన్ని 'మన రాజ్యం' అంటాం!
పూర్వం నుంచి కూడా...
ప్రజలు సంభాషించేటప్పుడు 'మా దేశం లో' అని,
పరిపాలించే రాజులు సంభాషిన్చేటప్పుడు 'మా రాజ్యం లో' అని వాడే వారు.
country noun NATURAL LAND - దేశం :


country noun POLITICAL UNIT - రాజ్యం :

మాత్రు భాష తెలిస్తే మాత్రు దేశం గురించి తెలుస్తుంది
అప్పుడే మన సంస్కృతీ, సంప్రదాయాలు, మన సంపద
మన ఆకలీ, మన అవసరాలూ
మన ప్రజలు, మన వెతలూ...తెలుస్తాయి.
అంతే గానీ,
ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియాన్స్ ఆర్ మై బ్రదర్స్ & సిస్టర్స్
ఐ లవ్ మై  కంట్రీ......  అంటే సరిపోదు!

మన గురించి మనం తెలుసుకోవాలి
మన భావం తెలియాలీ, మన భాష తెలియాలి!
దేశం మనదీ తేజం మనదీ.... ఎగురుతున్న జెండా మనదే!!
జై హింద్!!! జై హింద్!!! జై హింద్!!! జై హింద్!!!

Saturday, August 14, 2010

Hyderabad Today...


హైదరాబాద్ లో............................

ఒక్కో మూలలో ఒక్కో హడావిడీ....

1) .......................................... 

ఒక వైపు కళ్యాణమస్తు...సాముహిక వివాహాలు...


2) .........................................................  

మరో వైపు ఫాషన్  పెరేడ్ లు...


3) ............................................

ఇంకో వైపు... రోడ్ వైడెనింగ్ గొడవల్లో
ప్రభుత్వానికీ, ప్రజలకూ గొడవ... భారీగా పోలిసుల మోహరింపు!


4) ....................................

ఈ గొడవతో సంబంధం లేనట్టు...ఆగష్టు 15 స్పెషల్ ఆఫర్ల కోసం...
షాపింగ్ కామ్ప్లెక్షుల వద్ద అంత కన్నా భారీగా ఎగబడుతున్న జనం!

 5) .....................................

రంజాన్ ప్రార్థనలు....
6) .......................................

కామన్వెల్త్ ఎక్ష్ప్రెస్స్ కేరింతలూ....



7) ................................................

పాత మిత్రులతో శత్రుత్వాలు, కొత్త మిత్రులతో భేటీలు వగైరా
...రోజువారీ మంతనాలతో రాజకీయ నాయకుల బిజీ!


                                                               ( Andhra Political Map.)

.......చూస్తుంటే నగరమంతా దాని గజిబిజిలో అది ప్రశాంతంగానే ఉన్నట్లుంది...
వార్తలు రాసుకునే వాళ్ళు ఈగలు తోలుకుంటున్నారని సమాచారం, 
కానీ, మనకే విచారం లేదు!  Thats it. Simply this is today's Hyderabad!!

Sunday, August 8, 2010

బ్లాగి బ్లాగి బ్లాగీ ప్రేమాభిషేకం లో రాజేష్ లా...


ఒక లైను రాద్దామనుకుంటా
ఒక పేరా రాస్తా
ఆటోమాటిగ్గా రెండో పేరాలోకి వస్తా...
పేజీనిమ్పనిదే కడుపు నిండినట్లు ఉండదు సుస్టుగా తెలుగు భోజనం తిని పెరిగిన ప్రాణం కదా!
...ప్రేమాభిషేకం సినిమాలో
రాజేష్ దగ్గి దగ్గి చచ్చిపోయినట్లుగా

ఏదో ఓ రోజు బ్లాగి బ్లాగి ...చచ్చిపోతాను.
(ఆరు సంవత్సరాల క్రితం ఇప్పటి లాగే అయిదు బ్లాగులు, ఐదు కేటగిరిలుగా
వ్రాసేదాన్ని... బా..గా.. గ్యాప్ వచ్చి అవి కాస్తా గల్లంతయ్యాయి. సం" క్రితం జరిగిన
నా చావు బ్రతుకుల కార్యక్రమం... తదనంతర పరిణామాల కొనసాగింపుగా మా వాళ్ళు,
నా బుక్కులు కట్ట కట్టి అటక మీద దాచి పెట్టారు , నేను బ్రతికి బట్టకట్టాక...పాస్వర్డ్ లు , కీ
వర్డ్ లు పోగొట్టుకు పోయి, నా బ్లాగులు గతించాయి! ఐదు సంవత్సరాల రచనా సంపద...
ప్చ్... ఆలోచనా సముద్రాలు మనిషి మయిన్డులోఉండగా .. ఆవిరయిన మేఘాల గురించి
బాధ పడ్డం అనవసరమే...అయినా బాధ పడీ.. బాధ పడీ ...
...మళ్లీ కొత్త బ్లాగులు స్టార్ట్ చేశా... )
సో ఇలా ఏదో ఓ రోజు (చా.. లా .. సంవత్సరాల తర్వతలెండి ) బ్లాగి, బ్లాగి
చచ్చిపోతాను...
అభిమానంతో మీ మనసుల్లో పెట్టుకుంటారా సరే సరి,
బందీనయి ఉండిపోతా
లేదా...
దెయ్యాన్నయి శాశ్వతంగా స్పేస్ లో గిరికీలు కొడతా!...
హ హ హ హా...
...రాస్తాను, పడుకుంటాను
మళ్లీ లేస్తాను మళ్లీ రాస్తాను ...
...రాస్తూ రాస్తూ చేయాల్సింది మరచిపోతాను
చేస్తూ చేస్తూ రాయాల్సింది మరచిపోతాను...
.... పోగొట్టుకున్నదంటేనే మనిషికి మమత
మంద వంద ఉన్నా తప్పిపోయిన గొర్రె కోసమే కాపరి తాపత్రయం.
తాను పోయినా ప్రేయసి బ్రతికి ఉండాలీ అనుకుంటాడు ప్రేమికుడు
(టైటానిక్ లో డికాప్రియోల )
...అలాగే నేను పోయినా నా బ్లాగులు ఉంటాయనుకున్నాను,
కానీ, నేనున్నాను నా బ్లాగులు పోయాయి...
నేను ప్రేయసినో ప్రేమికున్నో నాకే అర్థం కావటం లేని ఈ క్షణాన ... ఇంతే!

Sunday, August 1, 2010

HAPPY FRIENDSHIP DAY










….In 1935 U.S.A Govt has killed a person on 1st Saturday of August.
And..the next day his friend died commiting suicide.
In his memory American govt had declared…1st Sunday of every August
As FRIENDSHIP DAY!
........ఇంగ్లీష్ వాళ్ళ స్నేహం వయసు 75 సంవత్సరాలేనా......
........అవమానంతో తల వంచుకు వెళ్తున్న కర్ణున్ని సాటి మనిషిగా గౌరవించి
స్నేహ హస్తం అందించి, అవమానించిన వారికి సాటి రాజును చేశాడు దుర్యోధనుడు.
తమ్ములు తన వారైనా, ధర్మం పగ వారిదే అయినా స్నేహ ధర్మానికి కట్టుబడి కడతేరాడు కర్ణుడు.
స్నేహానికి కల కాలానికీ కరిగిపోని కీర్తి కిరీటాన్ని పెట్టారా మిత్రులు!
.........భారతీయుల స్నేహం మహా భారతానిదేనా....
చరిత్రలో స్నేహాన్ని ..., గుర్తు చేసిన సంఘటనలు అవి!!
మానవాళికి , మనిషికే కాదు సృష్టిలోని ప్రతి జీవసమూహానికి...
స్నేహం ఓ సహజాత స్వభావం .
కుక్కా, పిల్లీ , నక్కా , గేదె , గొర్రె , మనిషీ ...ఎవరమైనా...
కలిసే జీవిస్తాం ....
మందలో సందడే వేరు , గుంపులోని ధైర్యమే వేరు.
సృష్టి లోనే స్నేహం కాంబినేసన్లు ఉన్నాయి:
ఉదా:హెచ్ టు ఓ .. ఆక్షిజన్ , హైడ్రోజన్ కలిస్తేనే ... ప్రానాధారామయిన నీరు.
రసాయనాల్లోని స్నేహ రహస్యాలు మనల్ని నడిపిస్తున్నాయి
సో ... స్నేహమేరా జీవితం , స్నేహమేరా శాశ్వతం
......డియార్ ఫ్రెండ్స్ ... మీరు లేకపోతే చనిపోతానో లేదో తెలియదు కానీ
మీరు ఉన్నందుకు బ్రతికి ఉన్నన్ని రోజులూ సంతోషంగా ఉంటాను ....
HAPPY FRIENDSHIP DAY !