Sunday, August 22, 2010

మజ్నూ కథ


(పొద్దు పోక టైం పాస్ కు పాత సినిమాలు చూస్తున్నప్పుడు
గుర్తుకొచ్చిన సంగతులు ...)
(....కొత్త సినిమాలు స్టాక్ లేవు ... )
బా..గా చిన్నప్పుడు...
...పిన్ని & బ్యాచ్ తో కలిసి
మజ్నూ సినిమాకెళ్లాను
మాయ్య తెగ నచ్చేశాడు!
ఏయ్ నీకు బాబాయి అవుతాడు/ అన్నారు పిన్నీవాళ్ళు లా... మాయ్య
కాదు బాబాయి
మావయ్యా మావయ్యా ...
చూడూ , మాకు మావయ్యే నీకూ మావయ్యే అంటే ఎలా ?!...
అంది బ్యాచ్ లో చిన్న పిన్ని
చాక్లెట్లు, మళ్లీ సినిమాకు తీసుకు వెలతామూ లాంటి అపాత్ర దానాలతో
బేర సారాలు మొదలెట్టారు...
అంతమన్దీ పట్టు పట్టి అడుగుతున్నారంటే ...
మాయ్యను వదులుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదనిపించింది
ఏం చేయాలని ఆలోచిస్తుంటే...
చందమామను అన్దరూ మామా అనడం గురించి నాన్న చెప్పిన కథ గుర్తొచ్చింది
...చందమామ అందరికీ మామే కదా అలాగే మజ్నూ కూడా మనందరికీ మాయ్యే ...చప్పున చెప్పీ వచ్చేశాను అక్కన్నించి .
..... ఇంట్లో ఒక్క దాన్నే ఉన్నాను ...
అమ్మెక్కడో పనితో కుస్తిపడుతోంది
నాన్న హాస్పిటల్ కు (పేషెంట్ అనుకునేరు, ఆయన డాక్టర్ .) వెళ్లి పోయాడు
సిబ్లింగ్స్ ఎక్కడ చీమిడి చీదుకుంటూ ఉన్నారో...
ఎవ్వరూ లేరు...
ఓ.కే.. గొంతు సవరించుకుని గాట్టిగా పాడ్డం మొదలెట్టాను ...
...ఇది తొలి రాత్రీ ఆ..ఆ ఆ ..(అప్పటికి ఏ అర్తం పర్థం తెలియదు)
కదలని రాత్రీ ...( ఎందుకు కదలదూ? ఇటు వైపు పడుకున్న వాళ్ళం అటు తిరిగే సరికి
భళ్ళున తెల్లారుతుంది, స్కూలుకు టైం అవుతుంది.)
... నాకు నీవూ , నీకు నేనూ చెప్పుకున్నాకథల రాతిరీ ....
( అబ్బా భలే ఉందే కథల రాత్రంట... ఏ ముహూర్తాన అనుకున్నానో కానీ,
ఆ తర్వాత ఎన్నో రాత్రులు కథలు రాస్తూ గడిపేస్తుంటాను.)
ఈ లోగా అమ్మ వచ్చిందీ, ఏం పాటలే అవీ ఆడపిల్లలు పాడేటివేనా అంటూ
వీపు విమానం మోత మోగించింది!
(ఇప్పుడెన్నిలవ్ స్టోరీలు , రొమాంటిక్ సీన్ లు రాసినా, ఏమోనే మా కాలంలో, మన ఇళ్ళల్లో
అవన్నీ లేవు! అంటుంది. సీమ ప్రాంతానికి చెందిన లవ్ లైఫ్ గురించి మరేదైనా సందర్భంలో......)
.....అమ్మ కొట్టిందన్న బాధతో ఉన్న నేను...
రోడ్డు మీద మెల్లగా పిల్లిలా నడుచుకుంటూ స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నాను..
(బయట పులిలా తిరిగితే అమ్మ ఒప్పుకోదు. ఆడపిల్లలు పిల్లుల్లా మెత్తగా అణకువగా ఉండాలి..టా ?
ఆడపిల్లలు చూట్టానికి మెతగ్గా ఉండాలి, నిజానికి గాట్టి ధైర్యం ఉండాలి, అప్పుడే ఆడ జీవితం లోని
ఒడిదుడుకులు తట్టుకోగలమని చెప్పిందీ అమ్మే. అమ్మ నేర్పిన ఆ ధైర్యం తోనే... ఐ వోన్ మై పీపుల్ &
ఐ చేన్జేడ్ మై పీపుల్! అందుకే ఇప్పుడు మీ ముందు ఉన్నాను!!
సో అలా మనం ఇంట్లో పులి బయట మ్యావ్ ..పిల్లి! కామన్గా బోయ్స్ కు ఇది రివర్స్ లో అప్ప్లై అవుతుంది...
అవ్వక పొతే ...నేనొప్పుకోను . అవ్వాలి, అంతే!!)
...రోడ్డు మీద మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాను
ఏం తీశాడురా సినిమా 'దాసరోడు
అని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు కొందరు అంకుల్స్
...'దాసరోడా' ?! ( మా ఊల్లో పెళ్లిల్లప్పుడు గండ దీపం మోసే వాన్నిదాసరోడంటారు.ఆయన సినిమా తీశాడా...నాకేం అర్థం కాలేదు. )
పిన్నీవాళ్ళను అడుగుదామంటే ...
నా మాయ్యను కొట్టేస్తారని భయ్యం!

ఎవ్వర్నీఅడగకుండా నేనే ఫిక్స్ అయిపోయాను,
ఏమనంటే... మనూరి దాసరోడు సినిమా తీయగా లేనిది... నేను తీయలేనా...!!
ఆ రకంగా ఆయనెవ్వరో తెలియకుండానే
మహానుభావుడు దాసరి నారాయణ రావు గారికి
ఏక లవ్య శిష్యురాలిని అయిపోయాను. నాకు తెలియ కుండానే నా జీవితాన్ని మలుపు తిప్పిన... మజ్నూకథ ఇది !
ఆ తర్వాత మా ఇంటికి హిందూ పేపరోచ్చిన్దీ, నా జీవితం లోకి స్పీల్ బర్గ్ వచ్చాడు , అది వేరే కథ!
... తర్వాత ఉదయం పేపరొచ్చిన్దీ , దాసరి నారాయణ రావు ఎవరో తెలిసింది. . .
..... సినిమా కథలు... పండించడం నుండి పారిపోయి
వండడాన్ని కూడా వదిలేసి ,
ఆనియన్, టమోటా, క్యాబేజీ, చీజ్ లూ పూసి..
బర్గర్లతో సరిపెడుతోన్న
మోడరన్ కథకుల పాలిట కుల దైవం ఆయన!!
హాలిఉడ్ వాళ్ళ దగ్గర బొచ్చెడు అడ్వాన్సు టెక్నాలజీ ఉందని, మనకు లేదనీ...
ఆడ లేక మన మద్దెల ఓటిదని నిందలు మోపుతున్నాం!
పంట పండించడము, వండి వడ్డించడము నేర్చుకుంటే ...
డిష్ గార్నిష్ చేయడం పెద్ద సమస్య కాదు!

No comments:

Post a Comment