Wednesday, August 25, 2010

అలుపెరుగని బాటసారిని

రచయితకు వయసుండకూడదు 
అప్పుడే రచనకు కూడా వయసుండదు!
 
కాలంగీతలను నా కన్నె మోము మీద గాట్లుపడనివ్వను 
కాలచక్రం ముందుకురుకుతుంటే
ఏ అలుపూసొలుపూ లేకుండా దాని వెంటే ... ముందుకూ, అవసరమైతే వెనక్కూ పరుగెడుతుంటాను. 
అలుపెరుగని బాటసారికి ... అంతుచిక్కని గమ్యాలే బలం! 


ఈ...
చీమలు దూరని చిట్టడవి
కాకులు దూరని కారడవి ప్రయాణం... నాకెంతో ఇష్టం!
మనిషి మస్తిష్కం లోనే ఉంది విశ్వం సమస్తం!!
ఎన్ని వేల నాడులున్నాయో
ఎన్ని లక్షల కణాలున్నాయో
ఎన్ని కోట్ల న్యూ రాన్ లున్నాయో...
కోట్ల మనుష్యులు, కోట్ల న్యూ రాన్ లు= కోట్ల ఆలోచనలు ..
... రహస్యాలే లేవు, ఉన్నదంతా బట్ట బయలే!
గుట్టు విప్పే చిట్టాల కోసం వెదుకుతుంటే
దొరికిన చిట్కాలు కొన్ని నా దగ్గరున్నాయి.

... ఈ ప్రయాణంలో మనం 
కీకారణ్యాలు దాటాము కానీ
ఉద్యానవనాలలో చిక్కుకున్నాము

...ఏడేడు సముద్రాలూ దాటిన నిపుణుడు.. 

మురికి కాలువలో కాలు జారి పడినట్లు...
... మనం సముద్రాలను అలవోకగా సాధిస్తాము కానీ
పిల్లకాలువల ముందు పిరికి వాళ్లమవుతాము.

అడవిలోని ఆకునైనా, సుడి తుఫానులోని పడవనయినా,
నడిచే మనిషినయినా, నడిపించే మనసునయినా
కాలమై పరుగులు తీసే అరణ్య అర్ణవాలెన్నైనా 

అలవోకగా దాటించి తీసుకు వెళ్తాను.. అనంతాలలోకి!
మీ కాలంతో నాకు పని లేదు
భూత, భవిష్యత్, వర్తమానాలు ... 

ఎప్పుడయినా సరే
నాతో రండి
మిమ్మల్ని ఈ తోటల బాటలు దాటిస్తాను!


...ఎందుకంటే నేనేమో అలుపెరుగని బాటసారిని, 
విశ్వమేమో నిత్యనూతన అణువూ, తరంగాల (Particles And Waves)సృష్టి విస్తరణా స్థలం... 


2 comments:

  1. ante adaviki prayaanam kammantunnaaraa? :)
    oorike saradaaki, viswam vinutna srusti tarangala chelima.. baagundi!

    ReplyDelete
    Replies
    1. Adavikaite naa thodu akkarledu, ANANTHAALAKU baatalu veyaalante appudu naa TRAVELS ni aasrayinchandi... Anonymous gaaru..!

      Delete