Thursday, March 17, 2011

కొందరి గత జన్మ రహష్యం!


ఇవ్వాళ రేపు అందరికీ గత జన్మంటే ఆసక్తే!
ఎందుకంటే...మన దేశంలో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం.
పోయిన జన్మలో చేసిన మంచి, చెడ్డలు - పాప, పుణ్యాలు...
bank account లాగా మన వెంట ఈ జన్మకు కూడా transfer అవుతాయని అంటారు.
ఆ కర్మ ఫలాలనే కష్ట, సుఖాలుగా, బంధాలుగా, ప్రేమ, పగలుగా...
పలు రకాల రుణానుబంధాలుగా face చేస్తూ ఉంటాం ఈ lifeలో...


అయితే ఒక్కోసారి అనుకోకుండా కొంత మంది గత జన్మ రుణాలు 
సామూహికంగా ముడిపడి ఉంటాయి...
అనేక మందికి ఒక మనిషి రుణపడి ఉండడం గానీ,
అనేక మంది ఒక మనిషికి రుణపడి ఉండడం గానీ...!

ఇలా...గత జన్మ రహష్యాలను ఛేదించే  క్రమంలో...
అనుకోకుండా నాకు సామూహికంగా కొంత మంది గత జన్మ రహష్యం తెలిసింది!!
ఆ కథ...మీ కోసం...

అనగనగనగా....పూర్వం ఒక రాజు ఉండే వాడు. 
ప్రజలను ఎంతో ప్రేమగా పరిపాలించే వాడు.
రాజ్యం ఎప్పుడూ సుభిక్షంగా ఉండేలా, ఎంతో తెలివిగా, గొప్పగా రాజనీతి ప్రదర్శించే వాడు.
రాజ్యంలోని అన్ని వర్గాల ప్రజలూ లబ్ధి పొందే వారు రాజాశ్రయంలో.
ఇలా 'రామ'రాజ్యంలా వర్ధిల్లుతున్న ఆ రాజ్యాన్ని చుసిన అనేక మంది పొరుగు రాజులకు 
ఎంతో ఈర్ష్యగా ఉండేది. ఏదో ఓ రకంగా ఆ రాజ్యంలో చిచ్చు పెట్టాలని తహ, తహలాడేవారు వాళ్లంతా.

అనుకోకుండా ఒక సారి...విదేశీ దాడులు జరుగుతున్న ఓ ఆపత్ సమయంలో...
పొరుగు రాజులకు 'రామ'రాజ్యాన్ని తిప్పలు పెట్టే అవకాశం వచ్చింది.
దాంతో...వాళ్లంతా విదేశీయులతో చేతులు కలిపి 'రామ'రాజ్యం పై దండెత్తారు.
కానీ 'రామ'రాజ్యం రాజు... కన్న బిడ్డల్లా చూసుకున్న ప్రజలూ, సైనికుల అండ చూసుకుని,
ఎంతో ధైర్యంగా వారిని ఎదిరించాడు.
యుద్ధం...హోరాహోరిగా జరుగుతోంది...
ఇంత సుశిక్షిత సేన ఉన్న 'రామ'రాజ్యాన్ని ఓడించడం అసాధ్యం అని అర్థమైన శత్రువులు...
కుతంత్రంతో ఆ రాజును జయించాలని నిర్ణయించుకున్నారు.
సామ, దాన, ధన, భేద, దండోపాయాలతో 'రామ'రాజ్యం సైనికులను లొంగదీసుకుని రాజును నిర్వీర్యున్ని చేశారు.
తన సొంత సేనలు నమ్మక ద్రోహులై చుట్టూ పరివేష్టితులై ఉండగా...
'రామ'రాజ్యం రాజును నిరాయుధున్ని చేసి...
నిలువునా వేటాడుతూ...వెంటాడుతూ...ఘోరంగా చంపేశారు!!!
సొంత మనుష్యుల నమ్మక ద్రోహం ఒక కంట...
ఘోరమైన చావును ఒక కంటా...చుసిన ఆ రాజు ఆత్మ ఆ ఘోషతోనే మరణించింది.

...కొన్ని వందల సంవత్సరాల తర్వాత...
'రామ'రాజ్యం రాజు...ఇప్పుడు మళ్లీ పుట్టారు.
ఆ నమ్మక ద్రోహ సైనికులూ, శత్రువులూ, విదేశీయులు కూడా మళ్లీ పుట్టారు.
రాజ్యాలు పోయాయి, రాజులు పోయారు.
భారత దేశం ప్రజాస్వామ్య దేశంగా అవతరించి ఉంది.
మరి రాజు గత జన్మ రుణాలు ఎలా తీర్చుకోబడుతాయి?
నమ్మక ద్రోహానికి, ఘోర ఆక్రమణకు, కిరాతక పాతకానికీ 
రుణగ్రస్తులు ఎలా మూల్యం చెల్లించాలి?
Bank పెట్టుకుని కూర్చున్న విధికి...అన్ని విధి, విధానాలు తెలిసే ఉంటాయి.
'రామ'రాజ్యం రాజు accounts...అంచెలంచెలుగా clear అవడం మొదలయ్యాయి...

ఇంతకీ ఆ రాజెవరై పుట్టాడా అనుకుంటున్నారు కదా..
ఆ రాజు...ఎవరో కాదు...ప్రముఖ దర్శకుడు 'రాం గోపాల్ వర్మ'!

ఇలా మరు జన్మలో...
'రామ్ గోపాల్ వర్మ'గా పునర్జన్మించిన 'రామ'రాజ్యం రాజు...
ప్రజాస్వామ్య, స్వతంత్ర భారత దేశంలో...
సినిమా దర్శకుడై...
గత జన్మలోని మంచితనం, నైపుణ్యాలతో...
ఒక వైపు తన ప్రత్యేకతను చాటుతూ...
మరో వైపు...తనకు నచ్చినట్లుగా తాను సినిమాలు తీసుకుంటూ...
తన మాటలు తన ఇష్టానుసారం మాట్లాడుతూ... 
తన కోసం మాత్రమె తను పని చేసుకుంటూ...
ప్రేక్షకులు, అభిమానులు, నిర్మాతలు, మీడియా మిత్రులుగా పుట్టిన నమ్మక ద్రోహుల పట్ల...
ఋణం తీర్చుకునే పనిలో ఉన్నాడు.
ఆయన తన శాయ, శక్తులా accounts clear చేస్తున్నారు మరి. 
ఎంతయినా తను ఎంతో ప్రేమగా పరిపాలించిన తన ప్రజలూ కదా.
అందుకే పాప విముక్తుల్ని చేస్తున్నారు.
ఇంతకీ ఆ సైనికులూ వగైరా ఎవరా అనుకుంటున్నారా...మనమే!
నమ్మకం కలగడం లేదా...
రుణానుబంధం మరి!!
గమనిక:ఇది నిజంగానే...కొందరి గత జన్మ రహష్యం!)
హెచ్చరిక:నమ్మకపోతే...రేపు "దొంగల ముఠా" వచ్చి నమ్మింప చేస్తుంది.

3 comments:

  1. Hi,i am Rahul.yes Dongala muta is worrest Film.Deni kanna Daily maa TV lo vachay "CID" serial chala Baguntundi.Adi okka Rojulonay Tistaru.

    ReplyDelete
  2. RGV ni directga critisise cheyochu kada..anduku leniponi gata janma vishayalanu enduku rayadam.
    but meru oka roju rasinatlugane marusati roju reles ayina dongala mutha...me gata janma story ki suitable ga sari poyindi. Nice guess...keep going...

    ReplyDelete
  3. @Rahul & Rukmini...
    RGV ni critisize cheyadaaniki idi raayaledu!
    Gata Janma Rahashyam gurinchi raase kramamlo...RGV gata janma rahashyam raashaanu!

    ReplyDelete