Tuesday, March 8, 2011

మళ్లీ నడుద్దాం....స్త్రీ సాధికారత వైపు...


స్త్రీలు గత దశాబ్దాలలో వేసిన ముందడుగులు...
అక్కడే ఆగిపోయాయి!

ఇవ్వాళ ఎంతో మంది తమ చదువులు,
తమ ఉద్యోగాలు, తమ స్వేచ్చలు తప్ప...
పక్క వారిని పట్టించుకోవడమే మానేశారు.
తరాల నాటి స్త్రీ ఎంతో కష్టపడీ వేసిన మార్గాలను మరచిపోవడమే కాక,
ఆ దారి వేరెవరికీ ఉపయోగ పడకుండా... 
అసూయా, ద్వేషం, అహంకారం,
డాబు, దర్పం లాంటి ...so called moralitiesఅనే ముళ్లను పరుస్తున్నారు.
స్త్రీకి స్త్రీయే శత్రువన్న ఇజాలను నిజాలు చేస్తున్నారు. 
ఈ సర్కిల్ లో లేక పొతే కట్టు తప్పిన వారిలా ముద్ర వేస్తున్నారు.
ఇంత చదువుకున్నా, పెద్ద ఉద్యోగం చేస్తున్నా,
మోడరన్ డ్రెస్ వేసుకున్న, దేశ విదేశాలు తిరిగి వచ్చినా
సరి హద్దుల్లో రక్తం చిందించినా...ఆకాశం హద్దులు తాకినా
తమను తాము ఒద్దికగా తండ్రి చేతిలోనో, భర్త చేతిలోనో 
పెడితే తప్ప ఆడ బ్రతుక్కి పరమార్థం లేనట్లు...
ఓ రహష్య ఒప్పందాన్ని శాసన పరుస్తున్నారు.
డాక్టర్స్, యాక్టర్స్, టీచర్స్,
ఇంజనీర్స్, సోషల్ వాలంటీర్స్
రైటర్స్, జర్నలిస్ట్స్...లీడర్స్...

స్త్రీని ప్రతి ఒక్కరూ అటే లీడ్ చేస్తున్నారు. 
తమ జీవితాల ద్వారా అటు వైపే అడుగులేసి చూపిస్తున్నారు!
వేరును తొలచమని, వేరు పురుగుకు దారి చూపిస్తున్నారు.!!
సహ జీవనమంటే సమ జీవనమే కానీ, 
సహనంతో...శవాల్లా జీవించడం కాదు.
తాతలు, తండ్రులు, మొగుళ్లు, మగాళ్లకే కాదు...
సమాజం మనది కూడా!
మానవ జాతి అంటే మనం కూడా!!     
     అందుకే జాతిని కాపు కాసేందుకు మన సాధికారత వైపు మనం మళ్లీ నడుద్దాం...
ఇక... రేపటి పౌరుల్లోని
సగమైన చాలా మందికి,
ఎవరో బలి దానాలు చేస్తే వచ్చిన స్వేచ్చ...
కత్తిరించిన బట్టలు వేసుకోడానికో
జుట్టును కత్తిరించుకోడానికో
ఉపయోగపడే సాధనం అయిపొయింది.
స్త్రీ సాధికారత అంటే...
జీన్స్ పాంట్స్ వేసుకోవడం,
జుట్టు కత్తిరించుకోవడం,
బాయ్ ఫ్రెండ్స్ తో తిరగడం కాదు!
స్త్రీ సాధికారత అంటే...
మన తండ్రులు, అన్నలు,
భర్తలు, కొడుకులు...
స్నేహితులు, సన్నిహితులు...
మనతో, కుటుంబంతో,
చుట్టూ ఉండే సమాజంతో...
మంచిగా, చెడ్డగా
తప్పుగా, ఒప్పుగా
సహాయమా, మోసమా
ఎలా మసలుకుంటున్నారో...
తెలుసుకోవడం, సరిదిద్దడం,
నేర్పించడం, తీర్చి దిద్దడం 'స్త్రీ సాధికారత'!
డబ్బు, సంపాదనా, రక్షణ
కొనుగోలు శక్తీ, లైంగిక స్వేచ్చ
స్త్రీ సాధికారత కాదు!
ఇవి...ఒక రాజ్యంలో
ప్రతి వ్యక్తి యొక్క 'పౌర సాధికారత'!!


ఈ సమ జీవన సమరంలో...
"మానవ సమూహాన్ని సాధికార పౌరుల సమాజంగా మార్చడం స్త్రీ సాధికారత!" 

  

9 comments:

 1. "సహ జీవనమంటే సమ జీవనమే కానీ,
  సహనంతో...శవాల్లా జీవించడం కాదు."
  i like those words very much :)

  ReplyDelete
 2. ఇంత చదువుకున్నా, పెద్ద ఉద్యోగం చేస్తున్నా,
  మోడరన్ డ్రెస్ వేసుకున్న, దేశ విదేశాలు తిరిగి వచ్చినా
  సరి హద్దుల్లో రక్తం చిందించినా...ఆకాశం హద్దులు తాకినా
  తమను తాము ఒద్దికగా తండ్రి చేతిలోనో, భర్త చేతిలోనో
  పెడితే తప్ప ఆడ బ్రతుక్కి పరమార్థం లేనట్లు...
  and
  జీన్స్ పాంట్స్ వేసుకోవడం,
  జుట్టు కత్తిరించుకోవడం,
  బాయ్ ఫ్రెండ్స్ తో తిరగడం కాదు!
  స్త్రీ సాధికారత అంటే...
  మన తండ్రులు, అన్నలు,
  భర్తలు, కొడుకులు...
  స్నేహితులు, సన్నిహితులు...
  మనతో, కుటుంబంతో,
  చుట్టూ ఉండే సమాజంతో...
  మంచిగా, చెడ్డగా
  తప్పుగా, ఒప్పుగా
  సహాయమా, మోసమా
  ఎలా మసలుకుంటున్నారో...
  తెలుసుకోవడం.....


  ila rendu mire chepthe confusion kada..what do u want to say exactly..?? mi view bagundi but i think presentation konchem miss ainatlu kanipisthundi...don't mind pls intha baga alochinchi danni correctga present chesthe inka feel untundani na opinion that's it...sorry

  ReplyDelete
 3. well said praveenaaaaa bt , vry less percentage of womans knows , understands and trying to do what u write....

  ReplyDelete
 4. @uday kiran...
  ఇంత చదువుకున్నా, పెద్ద ఉద్యోగం చేస్తున్నా,
  మోడరన్ డ్రెస్ వేసుకున్న, దేశ విదేశాలు తిరిగి వచ్చినా...
  ....ఇక్కడ...
  విశ్వ సౌబ్రాత్రుత్వ స్పృహ ఉండడం గురించి ప్రస్తావించాను.
  స్థల, కాల, వాతావరణ పరిస్థితుల రీత్యా ,
  globalization రీత్యా life style ను ఎంచుకునే స్వేచ్చ ఎవరికి వారికి ఉండొచ్చు!

  జీన్స్ పాంట్స్ వేసుకోవడం,
  జుట్టు కత్తిరించుకోవడం...
  ...ఇక్కడ...
  అనుకరణ, ఆగిపోవడం, బావిలో కప్పల్లా వేషం, భాషా మార్చడమే ప్రగతి కాదన్న భావం వెలిబుచ్చాను!!

  మన తండ్రులు, అన్నలు,
  భర్తలు, కొడుకులు...
  ...ఇక్కడ...
  ఇదే అసలు స్త్రీలు చేయాల్సిన పని.
  తమ చుట్టూ ఉండే తమ మగ వాళ్లను మార్చాలి!
  అప్పుడే స్త్రీల బానిసత్వ మూలాలు కదులుతాయి.
  తాము మారడం ఒక్కటే స్త్రీ విముక్తిని ఇవ్వదుగా.
  తమ పరిస్థితులను...తమకా పరిస్థితులను కల్పించే వారిని మార్చు కోవడమే అసలు యుద్ధం!
  Any how thank you for your suggestions Uday Kiran gaaru!

  ReplyDelete
 5. praveena reddy, your posts are very inspiring, all the best

  ReplyDelete
 6. Nice description about women empowerment Praveena...keep going.

  ReplyDelete
 7. Manava jaati modati baanisa stree. Yugaalu maarina aa satyam maarela ledu.

  ReplyDelete
 8. No words about this story praveena garu...
  meru oka adbhutamyna writer.
  oka stree kavadam valla streeki em kavalo telisinaa,
  elaa undalo chala mandi streelaku teliyadu.
  sadhikarata ichedikadu, tesukunedee kadu
  adi nirminchabadedi.
  aa nirmatalu strele anna satyam chala chakkagaa chepparu.
  and...idi streelanu dikkaramto chuse purushulaku lession la chadivinchali!
  inta adbhutanga stree ni define chesinanduku oka girl ga meku chala krutagnatalu!

  ReplyDelete