Friday, November 4, 2011

ఒక్క మాటలో మనం...


సంస్కారాలు, సంస్కృతులు,
సమన్వయాలు, సమతలు...
సందర్భాలు, సమస్యలు, 
పద్దతులు, పరిష్కారాలు...
సంగతులు ఎన్నైనా ఉండనీ..
ఒక్క మాటలో మనం... Poor Indians..!

...చాలా రోజుల క్రితం ఒక సారి
నా విదేశీ స్నేహితురాలితో కలిసి ఒక సినిమా చూశాను...
'ఒకే ఒక్కడు' అనే ఆ సినిమా చూసి బయటకొచ్చాక..,
నా స్నేహితురాలన్న మాటలు ఎప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉన్నాయి....
సామాజిక స్పృహ గురించిన అలాంటి సినిమాలు చూసినప్పుడంతా 
మనసంతా అదోలా అవుతూనే ఉంటోంది...

"Nice movie...
మీ వాళ్లు చట్టాలు మారినట్లు, 
రాజకీయాలు బాగుపడినట్లు..
society లోని loopholes close అయినట్లు..
courage ఉన్న leaders పుట్టుకొచ్చినట్లు  
ఎంచక్కా సినిమాలు తీసుకుని,
వాటిని చూసుకుని మురిసిపోతారు...
ఏదో పాపం అలా అయినా కాస్త ఆనందపడతారనుకుంటా 
poor Indians..." అంది.

ఆమెకెంతో ఉత్సాహంగా movie చూయించిన నేను అవాక్కయ్యాను!
ఆ తర్వాత...
movie లోని 'నెల్లూరు నెరజాణ..' song బాగుంది..
let us dance అనడమూ...
అది practice చేసీ..ఒక occasionలో perform చేయడం జరిగాయనుకోండి..,
అది వేరే విషయం!

ఆమె అన్నట్లుగా మార్పును 
సినిమాల్లోనో, కథల్లోనో...
నాటకాల్లోనో, regular బాతఖానీల్లోనో తప్ప 
మనం మారడం లేదు, మార్చుకోవడమూ లేదు.
ఒక revolutionary story విన్నా, చదివినా, సినిమాలో చూసినా  
నిజంగానే ఆ మార్పును realగా తెచ్చుకోలేని  
poor Indiansమేమో అని అనిపిస్తోంది...
కొంచెం బాధగా ఉన్నా ఇది నిజమనుకుంటా...

2 comments:

  1. మనకు సినిమాలు తీసి ఆన౦ది౦చడ౦ అన్నా చేతనై౦ది నీ విదేశి స్నేహితులకు అది కూడా చేతకాదనుకు౦టా మన౦ అలా అన౦దపడుతున్నాము అ౦టే దాని అర్థ౦ మన౦ మార్పుని కోరుకు౦టున్నాము అని. మన దురద్రుష్ట౦ ఏ౦ట౦టే మన౦ తప్ప మన చుట్టు ఉన్న వాల్ల౦తా మారాలనుకు౦టా౦. మార్పు అనేది మనతో మొదలవ్వాలి. సో నేను మారుతాను నువ్వు మారు తర్వాత ఛట్టాలు, రాజకీయాలు, సొసైటీ వాట౦తటా అవే మారుతాయి.

    We are not Poor Indians ! We are great Indians.................

    ReplyDelete
  2. @Praveen Reddy...
    Thank You Very much Great Indian gaaru...
    Keep going....

    ReplyDelete