Monday, September 5, 2011

My Masters

My Masters:
నా జీవన మార్గాన్ని నిర్మించిన శ్రామికులు... / My Masters...
నా జీవన ప్రయాణంలో వారు పరిచయమైన వరుస క్రమంలో...
Descriptions: వారిని నేను అన్వయించుకున్న అవగాహన మేరకు మాత్రమే Describe చేశా!


Sremati Y. Lakshmi Devi - My MoM
నా జీవితంలో అత్యంత కఠినంగా శిక్షలు విధిస్తూ.., శిక్షణనిచ్చిన తొలి గురువు!
అమ్మ శిక్షణ వలన... జీవితంలోని ఎంత కఠినతరమైన పాఠాలైనా, సులభంగా దాటవేయగల శక్తి వచ్చింది. 

Dr. V. Yella Reddy - My DaD 
అరటిపండు వలచి నోట్లో పెట్టినంత సులభంగా జీవిత పాఠాలను నేర్పారు.
వెన్నెల చలువను, తేనె తీపిని, అమృత భాండాగారం లాంటి ప్రేమను పంచారు...
చేదు విషాలను, సూర్యుని తాపాలను స్వయంగా face చేసే అవకాశాలను... మాకే వదిలేసిన నిగర్వి. 

Swami Shivananda - Rusheekesh 
Never forget Pranayamam - Never forget Yoga!
Bear Insult and Bear Injury! 
Telepathi, hipnotism, Nadee swara Sadhana లాంటి ఎన్నో 
మానసిక, ఆత్మిక విద్యలను ఆయన బోధనల ద్వార నేర్చుకున్నాను. 

Jesus Christ 
ప్రేమ, నమ్మకం, విశ్వాసం, మార్పు - స్వస్థత!
తప్పులు చేసిన పిల్లలను క్షమించడానికి మన తండ్రి అయిన దేవుడు... 
ఎదురు చూస్తున్నాడన్న సత్యాన్ని, పాశ్చ్యాత్తాప మార్గాన్ని బోధించిన కరుణామయుడు! 

BhagavadGita
మానవ జీవితం యొక్క సకల ధర్మాలను, సర్వ సుఖాలను, 
జీవన సులభాలను, మనిషి పరమార్థాన్ని అరహష్య పరిచే మహా గ్రంధం!
స్థల, కాల, పరిస్థితుల నిమిత్తం లేకుండా విశ్వం ఆద్యంతం వ్యక్తమయ్యే దివ్య సాధనం!! 

Lord Krishna
BhagavadGita వంటి మహా ధర్మాన్ని ప్రవచించిన ఆచార్యుడు!
మానవ మహాభారతాన్ని... సకర్మ బద్ధంగా సంభవం చేయడానికి అవతరించిన విశ్వైక స్వరూపం!! 

Swami Vivekananda
Love one and all - Serve one and all...
విశ్వ సౌభ్రాతృత్వాన్ని విరచించిన స్పురధ్రూపి.
ఇనుప ఖండరాలు, ఉక్కు నరాలు కలిగిన వెయ్యిమంది ఆధ్యాత్మిక యోధులను తయారు చేస్తే చాలు...
వాళ్ళే ఈ ప్రపంచాన్ని సమూలంగా మారుస్తారని సంకల్పించిన ఆధ్యాత్మిక యోధుడు! 

Sree Potuluri Veera Brahmendra Swami
ఆధ్యాత్మిక శోధనలను, భక్తి భావనలను ఉధృత ప్రచారం చేసిన తత్వ శాస్త్ర వేత్త.
భవిష్య ఊహలను పరిశోధించి, బాధా పరిహారాలు విప్పి చెప్పిన మహా జ్ఞాని!
ఆయన విరచించిన కాల జ్ఞానం ప్రపంచానికి ఎప్పటికీ ఒక దిక్సూచి!!

Bhagawan Sri Satya Sai Baba
ప్రేమ, సేవలు రెండూ... ఆధ్యాత్మిక సాగరాన్ని దాటించే రెండు తెప్పలని 
Practicalగా నిరూపించిన ఆధునిక యోగి! మార్గ దర్శి!! 

Sri Shiridi Sai Baba
శ్రద్ధ, సబూరి సాయి సూత్రాలు.
నేర్చుకున్న వారికి నేర్చుకున్నంత జ్ఞానం ఇచ్చే  దైవం.
సాక్షాత్ ఆది గురువు దత్తాత్రేయుని అవతారం!
సాధకులకు ఎన్నో రకాలుగా, వారడిగిన రీతిలో ఆధ్యాత్మిక, లౌకిక మార్గ దర్శనం చేయించే మహా గురువు!

Albert Einstein
అభౌతిక - అది భౌతిక - భౌతిక శాస్త్రాల సరిహద్దులు చెరిపేసిన Great Scientist!
Science పితామహుడు!

Lord Buddha
శాంతి, అహింసలను ఆవిష్కరించిన ఆధ్యాత్మిక మహా జ్ఞాని.
మానవ ఆధ్యాత్మిక శోధనలలోని ఎన్నో మూఢ విశ్వాసాలకు ముగింపు చూపిన గురువు.
బౌద్ధ మత సంస్థాపకుడు. 

Steven Spielberg
Hollywood Film Director
సృజనాత్మక, సాంకేతిక అంశాలకు, 
సరి కొత్త science ఊహలకు తెరపై జీవం పోసిన సినిమా బ్రహ్మ! 

Dr. Dasari Narayana Rao
తెలుగు సినిమా దిగ్ధర్శకుడు.
కొంచెం సినిమా వైపు కాళ్ళు నడిచే ప్రతి హౌత్సాహిక సినిమా జీవికీ తెలిసో, తెలియకో గురువు!
కథ, కథనంలకు కొత్త నడకలు నేర్పిన డైలాగాచార్యుడు! 

Dr. Samuel Hahnemann 
Homeo vaidya pitaamahudu!

Dr. Sigmund Freud
ప్రపంచ ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్త.
మనుష్యులను రెండు భయంకర భావాల నుంచి రక్షించిన మానస బ్రహ్మ. 

A Secret Book
కుండలినీ సాధనకు సంబంధించిన ఒక మార్మిక గ్రంధం!

Master subhash patriji
Pyramid Dhyana Kendra Vyavasthapakulu...
ఎన్నో మానసిక, సూక్ష్మ, అంతర, ఆధ్యాత్మిక సాధనలు పరిచయం చేసిన ధ్యాన యోగి!

Sri Praja Pita Brahma Baba
బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయ సంస్థాపకులు.
రాజ యోగ ధ్యానం!

Me, Myself 
నన్ను నేను పరిశోధించుకున్న  క్షణాలు...
జీవుతానుభావాలు...భవిష్యత్ యోచన!

Sri Paramhamsa Yogananda Swami
ఈ "ఒక యోగి ఆత్మ కథ" కోట్ల మంది జీవితాలను మలుపు తిప్పింది.
ఆ కోటిలో నేనూ ఉన్నానని నమ్ముతున్నాను!

Sri Maha Avatar Baba!


Sri Poornananda Giri Matha
గరు ముఖతా కుండలినీ దీక్ష ఆవశ్యకతను తెలిపి,
దీక్షను అనుగ్రహించి...సాధన పర్యవేక్షించిన గురువు!

Goddess Gayatri
గాయత్రి మంత్ర సాధన...
అద్భుత జీవన ఫలాలను అందించిన క్షణాలు...

Osho
అనంత జీవన సారాలన్నీ ఈ సాగరంలోనే, 
నేర్చుకుంటూ....ఉన్నాను!

Chalam
స్త్రీగా నన్ను సంపూర్ణం చేసిన స్త్రీ ప్రేమికుడు! 

Kaata Sekhar Reddy 
My Journalism Teacher
బయటి ప్రపంచంతో నాకు communication, connectivity కలిగించిన గురువు.
Exploration!



Master Sudhakar Garu
My Reiki Master.
నాకు ఊహ  తెలిసినప్పట్నించీ నేను ఎదురు చూసిన విద్యను, 
నాకు ఎదురుగా తీసుకువచ్చి, ఎంతో సమగ్రంగా నేర్పించిన గురువు!

Reiki Masters
Master Mikao Usui gi - 1865 - 1926
Master Chujiro Hayashi  - 1880 - 1940
Master Hawayo Takata - 1900 - 1980

Guru Viswa Spoorthi 
A Scientific Saint!
ఆధునిక Science inventionsకు దీటుగా, 
ఆధ్యాత్మిక ప్రపంచాన్ని Scientificగా నిరూపణా సమేతంగా ఆవిష్కరిస్తున్న...ఆధ్యాత్మిక శాస్త్రవేత్త! 

Mahaa Avatar Baba.., Again......
మనం మరచిపోయినా మనల్ని మరచిపోని వాళ్లే గురువులు!
మనల్ని తీర్చిదిద్దడమే వారి లక్ష్యం!
అందుకే ఆ కరుణామయుడు, ప్రేమ మూర్తి,...మహావతార్ బాబా మళ్లీ వచ్చాడు!
శిక్షణకు మనం యోగ్యులమయ్యేదాకా వారు వేచి చూస్తారు.
పరీక్షిస్తారు, మార్చేస్తారు మన జీవన రీతులను, నేర్పిస్తారు ముముక్ష విధానాలను!

2 comments:

  1. kekaaaaaaaaaaaaaa frnd ur '
    ''''''''''''''''''''''''


    wt a simplicity
    frnd
    ur really great

    ReplyDelete