Saturday, September 10, 2011

... Law Of The Seed!


ఒక చెట్టు నాటాలంటే... పది విత్తనాలు నాటాలి.
ఒక తోట పెంచాలంటే... 
చెట్టుకు పది విత్తనాల లాగా వందల విత్తనాలు నాటాలి!
అలా నాటితే, అప్పుడు యించు, మించు మనం అనుకున్నన్ని చెట్లు మొలుస్తాయి. 
ఉదాహరణకు మనం వెయ్యి విత్తనాలు నాటామానుకుంటే...
వెయ్యి మొక్కలు మొలవాలి, కానీ అన్నీ మోలుస్తాయా!? 
మొలవవు! వాటిలో కొన్ని నిర్వీర్యమవుతాయి.
దాంతో...ఓ సగమో, పావో మొలకెత్తుతాయి.
అంటే వెయ్యి నాటితే 500లో, వందో మొలకెత్తుతాయి. 
అంటే వంద చెట్ల కోసం వెయ్యి విత్తనాలను నాటాల్సి వచ్చిందన్నమాట! 
వందకు వెయ్యి నాటడమెందుకు??
వంద మాత్రమే నాటితే సరిపోదా? సరిపోదు! 
ఎందుకంటే ఆ నాటిన వాటిలో మళ్లీ సగమే మొలకెత్తుతాయి కనుక. 
మన జీవితం కూడా ఈ తోట లాంటిదే. 
మనం వేసే ప్రతీ అడుగు ఒక విత్తనం లాంటిదే. 
ఒక చెట్టు రావాలంటే పది విత్తనాలను నాటాలి. 
....లా ఆఫ్ ది సీడ్!.... 
...ప్రకృతి యొక్క ఈ సూత్రం తెలుసుకుంటే... 
మనలో నిరాశా నిస్పృహలు ఉండమన్నా ఉండవు. 
ఒక విజయం రావాలంటే పదిసార్లు ప్రయత్నించాల్సిందే. 
ఒక ఉద్యోగం సంపాదించాలంటే పది ఇంటర్వ్యూలకు అటెండ్ కావాలి. 
Even, ఒక మంచి ఉద్యోగిని ఎన్నుకోవాలంటే పది మందిని ఇంటర్వ్యూ చేయాల్సిందే. 
చివరకు ఒక చిన్న వస్తువు కొనడానికి పది షాపులు తిరగాలి.
ఒక్క డ్రెస్ కొనడానికి నాలుగు ట్రయల్ వేస్తాం.
అంతే కానీ ఇలా ప్రయత్నించగానే అలా విజయం రాదు.
So విజయం రావడం లేదని ప్రయత్నించడం మానేయకండి.
.... Law Of The Seed....Try and try AGAIN!

2 comments:

  1. frnd meeru me poets vintuntey
    naaku punnitha mai pothiundi frnd
    marvellous ................superb

    ReplyDelete