Monday, September 19, 2011

I did a MISTAKE.., yes I did...

ఒక తప్పు చేశాను...
Love One And All - Serve One And All...

ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదు!...
"నేను" ప్రేమించాను...
"నేను" సహాయం చేశాను...
"నేను" సేవలు చేసీ..., "నేను" పెద్ద తప్పు చేశాను!

ఒక అమ్మాయి ఇరవై ఏళ్ల వైవాహిక నరకం నుంచి బయట పడటానికి help చేశాను.
ఇందులో తప్పేముందీ అనుకుంటున్నారా?.., ఉంది.
ఆ, ఆ...So called problems జోలికి వెళ్లకండి...
అవి చిన్నవి. మనం వద్దనుకుంటే వాటిని వదిలించుకోగలం!
కానీ, మనకే తెలియకుండా మనం కొన్ని విష భావాల వలయంలో చిక్కుకుంటాం.
ఆ సుడిగుండంలో ఉన్నామని తెలియడానికే చాలా కాలం పడుతుంది,
ఇక బయటపడటం...అ..సాధ్యం!
చిన్నప్పట్నించీ ఆమెకు నేనంటే నమ్మకం...
ఏ రోజైనా ఆమె వద్దనుకుంటున్న జీవితాన్ని మార్చి ఇస్తానని!
నేనంటే ప్రేమ, గౌరవం...భక్తి కూడా!
ఒక్క ముక్కలో... నేనే తన angelని.
Hmmm, ఇక ఆగుతానా...
ప్రేమను ధారాళంగా పంచేశాను...
risk తీసుకుని help చేశాను.
ప్రేమ ఉంటే... అన్నీ ఉంటాయి...
ధనము, స్థలము, కాలము, జ్ఞానము.. అన్నీ..!
ఆమె నరక కూపం నుంచి బయట పడింది...
తన కాళ్ల మీదకు వచ్చింది, lifeలో settle అయ్యింది...
ఆట ఇప్పుడే మొదలయ్యింది...
నన్ను shuttle ఆడటం మొదలెట్టింది...
angel angle మారింది.
భక్తి పోయింది, ప్రేమ పోయింది...
కనీస గౌరవం కూడా పోయింది!

సాటి వారి సమస్యల పట్ల, పరిస్థితుల పట్ల విమర్శలు, సూటి,పోటి మాటలు, సెటైర్లు...
పిల్లికి బిచ్చం పెట్టే ఉద్దేశ్యం కూడా లేదా పిల్లకు...
సాటి మనుష్యులకు, స్త్రీలకు, కనీసం తన లాంటి అభాగినులకు అండగా నిలుస్తుందనుకుని నీళ్లు పోశాను ఆ చెట్టుకు! 
అహంకారం....తన చేత యేరు దాటిన తెప్పను తగులబెట్టించింది.
స్వార్థం.., అరిషడ్వర్గాలు.., So called భావాలు...
ఇల్లు మారింది, మనిషి మారాడు...కానీ ఆ పిల్ల పాత గూటి జీవితానికే స్వేచ్ఛను మితం చేసుకుంది..!

ఆ.., యే పక్షి యే గూటికి పొతే మనకెందుకూ...
ఎగురవేయడమే మన వంతు!
నిజమే కానీ, నేను కూడా ఇంకా దేవత..నూ.. అవ్వలేదుగా....మనిషినే!
మనిషన్నాక మంచీ, చెడ్డా ఉంటూనే ఉంటాయి.
మంచిదో, చెడ్డదో...కానీ ఆమె బాగుంది...నేనే పాడై పోయాను...
ఆమె ఎప్పుడు కనిపించినా కోపం, ఆవేశం, అనవసరంగా help చేశానన్న ద్వేషం....
ఇంకేదో తెలియని విద్వేషం!
ఆమె ప్రవర్తన కూడా అగ్గికి ఆజ్యం పోసినట్లు no respect, no love...nothing...
ఆమె మీద ప్రజ్వరిల్లు..తూ... రెండేళ్లు నా ఇల్లు, ఒళ్లు, సోలు...బాగా బాధలు పడ్డాక....
... Suddenగా ఈ రోజే నాకు, 'జ్ఞానోదయం' అయ్యింది!

 మనకు ఎంతో మంది ఎదురు పడుతూ ఉంటారు జీవితంలో,
చాలా మందికి కృతజ్ఞత, అపరాధ భావం ఉండవు.
అవి రెండూ లేని చోట ప్రేమ ఉండలేదు!
అది వారి నైజం. ఇక ప్రేమ, స్నేహం మన స్వభావం.
మనం ఇస్తున్నాం దానంగా....
మరి.., ఒక చేత్తో చేసిన దానం ఇంకో చేతికి కూడా తెలియ కూడదు..., అన్నారు పెద్దలు!
కానీ మనం... చేసిన దాన్ని మనసారా గుర్తు పెట్టుకుంటున్నాం...
అంతఃచేతనా మనసులోకి.., లో లోపలికి ఇంకేలా జాగ్రత్తగా దాచి పెట్టుకుంటున్నాం.
ఇక ఆ ప్రేమనో, డబ్బునో, సేవనో పొందిన వారు
మనం ఎక్కడ కనిపించినా ప్రేమించాలని, తిరిగి help చేయాలని,  
కనీసం గౌరవించాలని.., ఒక false alarm on చేసుకుని కూర్చుని ఉంటుంది మన అంతరంగం!
చాలా సందర్భాల్లో మనం నిరాశ పడే ప్రవర్తనే ఎదురవుతుంది...
దాంతో ఇక ఒక సంఘర్షణ మనలో రాజుకుంటుంది.
అది మన మహానీయతలను రూపు మార్చి మహత్వ కాంక్షలుగా మార్చేస్తుంది.
మన అవున్నత్యం, అవుదార్యాలు గ్రాఫ్ లో కిందకు పడిపోతాయి.
మన మనస్సు, అంతఃమనస్సు...తద్వారా మన శరీరం...సర్వ నాశనం అయిపోతాయి!

ఒకరికి help చేయడం ఎందుకూ మనం నాశనం కావడం ఎందుకూ అనిపిస్తుంది!
అలాగని అవసర పరిస్థితుల్లో మనం తప్పుకుని పోలేము.
మరి ఏమిటి కిం కర్తవ్యం?
...ఒక చేత్తో చేసింది ఇంకో చేతికి తెలియకుండా ఉండటమే....
దానం చేయడంలోని రహష్యం!
అది డబ్బయినా, ప్రేమయినా, సేవయినా, స్నేహమయినా, సహాయమయినా...
నీ హృదయంలో యే రకమయిన ప్రతిఫలమూ ఆశించకుండా ఉండేట్లయితే..నే...చెయ్యాలి!

సరే.., 
జీవితంలో తెలియనప్పుడు ఎన్నో జరుగుతుంటాయి....
ఇప్పుడు తెలిసింది కదా జాగ్రత వహిద్దాం...అనుకోవచ్చు.
కానీ, మరచి పోతాం. అదే మహత్వ కాంక్ష యొక్క తీవ్ర స్వభావం!
ప్రపంచంలోని కోట్లాది మందిమి ఈ కాంక్ష కోసమే ఏదైనా చెయ్యడానికి...ఎగబడతాము!
మన ego అనుకున్నట్లు అన్నీ సవ్యంగా reflect అయితే happy!
కానీ, ఇలా తేడా జరిగినప్పుడు మాత్రం మహత్వ కాంక్ష యొక్క అహం దెబ్బ తింటుంది...
అప్పుడు దానికది చేసుకునే గాయం... దానికి కాదు, మనకు గాయమవుతుంది!
ఇది గుర్తించినా దీన్ని జయించడం కొంచెం కష్టమనే అనిపిస్తోంది.
మరి, గుర్తించ లేకుండానే ఉంటే...అమ్మో!

ప్రకృతి యొక్క sharing స్వభావాన్ని అర్థం చేసుకుంటే తప్ప...
మనం ఇచ్చి- పుచ్చుకునే సిద్దాంతాన్ని ఒంటబట్టించుకోలేము!
ఒక సారి ఆ awareness వచ్చాక...
వచ్చాక కూడా మళ్లీ అవే పరిస్థితులే ఎదురవుతాయి...
So, awareness పట్ల awareness అలవరచుకోవాలి...
లేకపోతే ఒక సారి బాధ పడ్డట్లే మళ్లీ, మళ్లీ బాధ పడాల్సి వస్తుంది నాలా!

విశ్వం నాకు ఇంతకు ముందే ఇలాంటి ఓ అనుభవాన్ని ఇచ్చి ఉన్నా,
నేను ఆ విషయాన్ని మరచిపోయి మళ్లీ మహత్వ కాంక్షలో ఇరుక్కున్నాను.
కాలేజీ రోజుల్లో...
Jessica Jasmine - నా badminton co-player.
Situation: Jessi exam fees కట్టాలని ఏడుస్తోంది...
Purpose: Jessi 1st year fail అయిన subs గురించి వాళ్ల ఇంట్లో వాళ్లకు తెలీకూడదు. 
Me: Love Jessi...so help Jessi
Action: హాస్టల్ ఫీజు కట్టాల్సిన డబ్బుతో Jessi exam fees కట్టా.
Reaction: Ten daysలో adjust చేస్తానన్నది కాస్తా...Exams అయిపోయినా ఇవ్వలేదు.
Reflection: Hostel fees కోసం నాన్నతో classగా తిట్లూ...
అమ్మతో massగా తన్నులు తినాల్సి వచ్చింది.
Struggle: Dad సెలవల్లో weekly ఒక letter రాయించేవారు జెస్సీకి.
"ఇంకా adjust చేయలేక పోతున్నాను.. కానీ ఎలాగైనా నీ డబ్బు ఇచేస్తాను...
నా రక్తం అమ్మి అయినా నీ ఋణం తీర్చుకుంటాను!"(literally!)
అని జెస్సి ప్రతి ఉత్తరానికీ ప్రత్యుత్తరం...
Dad వదలడు - Jessi పలకదు!
అనవసరంగా help చేశానన్న బాధ, కోపం, వివశత, విద్వేషం!
Jessi డబ్బు ఇవ్వనే లేదు!! ( ఇప్పటికీ)
Dear Jessi, still I miss you!

అలా... ఒక స్వయం విద్వేషపు బాధను నేను మరచి పోయాను...
మళ్లీ ఇంకో అమ్మాయికి ఇంకో పెద్ద help చేసీ, నా మహత్వ కాంక్షలో నేను ఇరుక్కున్నాను!
ఏమో...చిన్న - చితకవి, మరచినవీ...ఇలాంటివే ఇంకా ఎన్ని అనుభవాలను నేను  మరచిపోయానో తెలియదు!
But, today I realize!
మళ్లీ మరచి పోకూడదని బలంగా అనుకుంటున్నాను...
పంచడం గురించి కాదు, పంచిన దాన్ని ఎంచడం గురించి!
నేను చేశాననుకోవడం కన్నా, నా వంతుగా జరగాల్సింది జరిగిందీ...
అనుకోవడం.., మనకు మనమే చేసుకునే గొప్ప సహాయం!
ఎందుకంటే మనిషన్నాక ఏదో ఒకటి...ఎవరికో ఒకరికి...ఎప్పుడో ఒకప్పుడు...
దానం...చేయక తప్పదు!

4 comments:

  1. Superb Article... :) :) Infact very true.. these incidents must have happened in everyone life at least one time but so many people don't realize whether this incidents have really happened :)

    ReplyDelete
  2. mothhaniki oka abagyuduchesina "help" svardham anttaru.. anthenaa????
    kakapothe yedho story laa umdhi.. but,,,,, ok ...

    ReplyDelete