Wednesday, August 31, 2011

ఒక వేళ...


ఒక వేళ...
...ఒక వేళ ఆకాశం చేతులకు తాకేలా ఉంటే
ఒక వేళ భూమికి రెండు చందమామలు ఉండుంటే...
ఒక వేళ సముద్రాలు శూన్యంలోంచి కిందికి వేళ్ళాడితే
ఒకవేళ మనుష్యులు కాళ్లు లేకుండా పాముల్లా పాకుతుంటే...

... మనిషికి ఈ 'ఒక వేళ' అంటే
చాలా ఆసక్తి.
గతంలో జరిగిన వాటికైనా
ఇప్పుడు జరుగుతున్న వాటికైనా
భవిష్యత్తులో జరగాల్సిన వాటికైనా...
ఒక వేళ ఇలా జరిగే బదులు అలా జరిగుంటే,
ఇది ఇలా జరక్కుండా ఉంటే...
కనీసం ఇదైనా ఒక వేళ అలా జరక్కుండా ఇలా జరిగితే బాగుండు...

... ఈ తప్పు చేసుండకుంటే 
ఈమె బదులు ఇంకో ఆమెతో పెళ్లి జరిగుంటే
ఒక వేళ మెడిసిన్ చదవకుంటే
ఒక వేళ ఆ టైమ్లో అక్కడకు వెళ్లకపోయుంటే 
వీడు నా ఫ్రెండ్ కాకోయింటే
నాకు పెద్ద ఉద్యోగమే వచ్చిఉంటే
పండక్కి మా ఊర్లో ఉండుంటే
మా నాన్నకు హార్ట్ అటాక్ రాకుండా ఉంటే
చెల్లి పుట్టక పోయుంటే
ఆ పనికిరాని వాడు ఇప్పటికే చచ్చి పోయుంటే
ఈ వాన పడకుంటే
ఎండాకాలం చలిపెట్టుంటే
ఈ దేశంలో పుట్టక పోయింటే
నేను ఈ తల్లితండ్రులకు పుట్టక పోయుంటే
అసలు మా నాన్న మా అమ్మను కాకుండా ఇంకో అమ్మను పెళ్లి చేసుకునుంటే...
....ఇలా..., ఒక వేళలకు అసలు అంతే ఉండదు!

కానీ ఒక వేళ ఈ ఒక వేళలు...
...జరగకుంటే...
ఇది సత్యం! ఈ 'ఒక వేళ'లు జరగవు!!
ఎందుకంటే అవి పుట్టి లేవు కనుక.
ఏదైతే జరుగుతుందో...
అది మాత్రమే జరుగుతుంది.
ఒక వేళ ఇంకో..లా జరిగితే...
ఆ ఇంకో..లా నే ఉంటుంది కానీ ఇంకో ఇంకో..లా జరగదు!

So, ఈ ఒక వేళలను వదిలిపెట్టి
ఉన్న వాటి ఉనికిని ఉన్నదున్నట్లుగా ఒప్పుకోండి.
ఒక వేళ... ఇలా జరగాలి కాబట్టే ఇలా జరుగుతుందేమో...
... అర్థం చేసుకోండి.
గడియారం ముల్లును తిప్పగలిగినట్లు...
కాలాన్ని ముందుకూ, వెనక్కు తిప్పి, 
ఇంకోలా స్థితుల గతులను మార్చే మంత్రాలేమీ లేవు.
ఒకవేళ, ఏ యంత్ర ప్రయోగమో ఫలించి కాలాన్ని వెనక్కు తిప్పి 
ఇంకోలా పరిస్థితులను సరిదిద్దినా..,
అప్పుడు కూడా ఆ ఇంకో..లా జరిగినవి మాత్రమే ఉంటాయి కానీ, 
ఒక పరిస్థితికి రెండు స్థితులు ఉనికిలో ఉండలేవు.
So, ఒక వేళ.. ఎప్పటికీ పుట్టనిదని తెలుసుకుని,  
మీ పరీక్షా పత్రానికి జవాబులు రాసుకోండి!

Saturday, August 13, 2011

జీవితమంతా నా తోడై ఉండే తోడబుట్టిన వాళ్లకు, తోడై ఉంటానని ప్రేమగా....

There's no other love like the love for a brother.
There's no other love like the love from a brother.

God could not take care for the whole world
so he has given mothers to each family.

In the same way...
Mother could not take care for the whole part of our life,
so she had given Siblings(brothers/sisters)!

As per Human Social History...
...ఒక మనిషికి అత్యంత సమీప బంధువు, 
ఇంచు మించు తన మరో మరో ప్రతి రూపం...
...తోబుట్టువులు!

స్వయంగా మన తల్లి కన్న, తండ్రి కన్నా తోబుట్టువులే మనకు దగ్గరి బంధువులు!
మన తల్లి రక్తం మనలో ఉంటుంది కానీ మన రక్తం మన తల్లిలో ఉండదు...
...ఆమెలో ఆమె తల్లి+తండ్రి రక్తం ఉంటుంది.
అలాగే మన తండ్రిలో కూడా ఆయన తల్లి+తండ్రి రక్తం ఉంటుంది.
So, మనలో మాత్రమే, తోబుట్టువులలో మాత్రమే ఒకే రక్తం..."మన తల్లి+మన తండ్రి రక్తం" ఉంటుంది!
అందుకే ఇది రక్త సంబంధం!!!

ఒకే జైవిక రూపం పలు జీవిక / జీవితాలుగా రూపు చెందడమే...తోబుట్టువులు...
సంతోషం, సుఖం, భావం, బాధ, దుహ్ఖం, కోపం అవసరం, అలవాటు, ఆత్మ....
మన జీవితాన్ని, జీవితంలోని ప్రతి క్షణాన్ని మన లాగే సహ అనుభూతి చెందే తోడే... తోడబుట్టిన వాళ్ళు!!
జీవితమంతా నా తోడై ఉండే తోడబుట్టిన వాళ్లకు, తోడై ఉంటానని ప్రేమగా చేసుకునే ప్రమాణ ఉత్సవం...రక్షా బంధనం!!!

I LOVE YOU MY DEAR LITTLE BROTHERS ♥ ♥


Wednesday, June 29, 2011

A Touching Message...

I deleted one of my friends number from my phone book.
Because of certain misunderstandings between us.

...Today I received a friendship message from 
an unknown number...
I replied..."Who are you?"
His reply made me cry literally...
"Idiot...don't you even know the spelling of HOW ARE YOU?
I'm fine dude..."

Real Friends Are Really Real!
But this story is not ReAl!!
I got this story as a message from a friend...

^^^^^^^^^^^Ha hA hA Ha^^^^^^^^^^^^^^^^


Life Is CraZy


Life is crazy!
Because...
What you want... you don't get.
What you get... you don't enjoy.
What you enjoy... is not permanent.
What is permanent is BORING...
LIFE IS CRAzY!!

Monday, May 2, 2011

పుటుక్...


ఆకాశం అంటే నాకు చాలా ఇష్టం
ఆకాశానికీ నేనంటే ఎంతో ఇష్టం
అందుకే ఆకాశం నా కోసం కాలు జారింది
కానీ...ఆకాశం మీది ప్రేమతో నా కాలు విరిగింది.
{ I just fell down the stairs, sprained the ankle and had my foot... }


Monday, April 4, 2011

ఖర నామ ఉగాదికి కమనీయ స్వాగతం...


ఉగాది శుభాకాంక్షలు!
కళ, కళ లాడే వేపచెట్లు
మిల, మిల లాడే మామిడి కాయల గుమ, గుమలూ
మావి చిగురు తిన్న కోకిలల కిల, కిలలూ... 
చెరుకు గడల తియ్యందనాలు 
చింత పులపరింతలు
కొత్త కారం, ఉప్పుల ఊరింతలూ...
ప్రకృతిని ప్రేమతో పరిపూర్ణం చేసే... వసంతుడు తోడుగా వస్తోన్న 
ఓ ఉగాదీ...కమ్మటి తెలుగు గొంతుకలతో నీకు స్వాగతం!!

Friday, April 1, 2011

Human Planet


Human Planet is an awe-inspiring, jaw-dropping, heart-stopping landmark series that marvels at mankind's incredible relationship with nature in the world today.

Uniquely in the animal kingdom, humans have managed to adapt and thrive in every environment on Earth. Each episode takes you to the extremes of our planet: the arctic, mountains, oceans, jungles, grasslands, deserts, rivers and even the urban jungle. Here you will meet people who survive by building complex, exciting and often mutually beneficial relationships with their animal neighbours and the hostile elements of the natural world.

Human Planet crews have filmed in around 80 locations, bringing you many stories that have never been told on television before. The team has trekked with HD cameras and state of the art gear to film from the air, from the ground and underwater. The result: a "cinematic experience" created by world-class natural history and documentary camera crews and programme makers.

by on Jan 11, 2011