Wednesday, August 31, 2011

ఒక వేళ...


ఒక వేళ...
...ఒక వేళ ఆకాశం చేతులకు తాకేలా ఉంటే
ఒక వేళ భూమికి రెండు చందమామలు ఉండుంటే...
ఒక వేళ సముద్రాలు శూన్యంలోంచి కిందికి వేళ్ళాడితే
ఒకవేళ మనుష్యులు కాళ్లు లేకుండా పాముల్లా పాకుతుంటే...

... మనిషికి ఈ 'ఒక వేళ' అంటే
చాలా ఆసక్తి.
గతంలో జరిగిన వాటికైనా
ఇప్పుడు జరుగుతున్న వాటికైనా
భవిష్యత్తులో జరగాల్సిన వాటికైనా...
ఒక వేళ ఇలా జరిగే బదులు అలా జరిగుంటే,
ఇది ఇలా జరక్కుండా ఉంటే...
కనీసం ఇదైనా ఒక వేళ అలా జరక్కుండా ఇలా జరిగితే బాగుండు...

... ఈ తప్పు చేసుండకుంటే 
ఈమె బదులు ఇంకో ఆమెతో పెళ్లి జరిగుంటే
ఒక వేళ మెడిసిన్ చదవకుంటే
ఒక వేళ ఆ టైమ్లో అక్కడకు వెళ్లకపోయుంటే 
వీడు నా ఫ్రెండ్ కాకోయింటే
నాకు పెద్ద ఉద్యోగమే వచ్చిఉంటే
పండక్కి మా ఊర్లో ఉండుంటే
మా నాన్నకు హార్ట్ అటాక్ రాకుండా ఉంటే
చెల్లి పుట్టక పోయుంటే
ఆ పనికిరాని వాడు ఇప్పటికే చచ్చి పోయుంటే
ఈ వాన పడకుంటే
ఎండాకాలం చలిపెట్టుంటే
ఈ దేశంలో పుట్టక పోయింటే
నేను ఈ తల్లితండ్రులకు పుట్టక పోయుంటే
అసలు మా నాన్న మా అమ్మను కాకుండా ఇంకో అమ్మను పెళ్లి చేసుకునుంటే...
....ఇలా..., ఒక వేళలకు అసలు అంతే ఉండదు!

కానీ ఒక వేళ ఈ ఒక వేళలు...
...జరగకుంటే...
ఇది సత్యం! ఈ 'ఒక వేళ'లు జరగవు!!
ఎందుకంటే అవి పుట్టి లేవు కనుక.
ఏదైతే జరుగుతుందో...
అది మాత్రమే జరుగుతుంది.
ఒక వేళ ఇంకో..లా జరిగితే...
ఆ ఇంకో..లా నే ఉంటుంది కానీ ఇంకో ఇంకో..లా జరగదు!

So, ఈ ఒక వేళలను వదిలిపెట్టి
ఉన్న వాటి ఉనికిని ఉన్నదున్నట్లుగా ఒప్పుకోండి.
ఒక వేళ... ఇలా జరగాలి కాబట్టే ఇలా జరుగుతుందేమో...
... అర్థం చేసుకోండి.
గడియారం ముల్లును తిప్పగలిగినట్లు...
కాలాన్ని ముందుకూ, వెనక్కు తిప్పి, 
ఇంకోలా స్థితుల గతులను మార్చే మంత్రాలేమీ లేవు.
ఒకవేళ, ఏ యంత్ర ప్రయోగమో ఫలించి కాలాన్ని వెనక్కు తిప్పి 
ఇంకోలా పరిస్థితులను సరిదిద్దినా..,
అప్పుడు కూడా ఆ ఇంకో..లా జరిగినవి మాత్రమే ఉంటాయి కానీ, 
ఒక పరిస్థితికి రెండు స్థితులు ఉనికిలో ఉండలేవు.
So, ఒక వేళ.. ఎప్పటికీ పుట్టనిదని తెలుసుకుని,  
మీ పరీక్షా పత్రానికి జవాబులు రాసుకోండి!

No comments:

Post a Comment