Tuesday, October 16, 2012

కుడి ఎడుమయితే... పొరపాటు ఉంది.


కుడి ఎడుమ 
... అనగనగా ఒక సారి.. ఒక కుడి చేయి ఒక ఎడుమచేయి 
ఒక దానితో ఒకటి గొడవ పెట్టుకున్నాయట.

నేను నీకు ఎన్నో సార్లు ఎంతో సేవ చేస్తుంటాను 
కాని, నువ్వు ఎప్పుడో ఓ సారి మాత్రం చేయూతనిస్తుంటావు

అది కూడా అంటీ ముట్టనట్లుగా, వచ్చే రానట్లుగా ఉంటాయి నీ పనులూ.. అందిట, కుడి చేయి.

అలా అంటావెమిటీ  నువ్ ఏ పని చేసినా నేనూ నా వంతు సహకారం చేస్తూనే ఉంటాను గా 
నేను లేకుండా నువ్ ఒంటిగా చేసే పనులేమున్నాయి... అని ఎడుమ చేయి ఎదురు చెప్పిందట.

నాకే ఎదురు చెబుతావా అని కుడి చేయి గురి చూసి నాలుగు పీకిందట..
నువ్ చేసిందేదైనా, అందులో సగమైనా నేను చేయ్యానా అని ఎడుమ చేయి రెండు తగిలించిందట.
అలా, అలా నాలుగూ, రెండు నిష్పత్తిలో కొంత కలహం జరిగాక రెండూ అలసి పోయాయట.

ఆగి ఆయాసం తీర్చుకుంటుండగా నొప్పితో కూడిన బాధ వల్ల కలిగిన స్పృహతో..
కొంత జ్ఞానోదయం అయ్యింది వాటికి. 
ఇలా మనం గొడవ పడటం వల్ల ఏం సుఖం లేదు, బాగా నేప్పేడుతోంది కొంచెం వేళ్లు ఒత్తి పెట్టమందట ఎడుమ 

కాసేపటికి, కుడి వంతు వచ్చింది. కుడి చేత్తో హాయిగా సేవలందుకున్న ఎడుమ, 
అలవాటు ప్రకారం వాటం లేని వంకరతో అరకొరగా ఒళ్లు పట్టినట్లో లేక
తట్టినట్లో చేసి చేయి దులుపుకుంది.
అనవసరంగా గొడవ పడి కుడి ఆయాస పడటం తప్ప
ఎడుమ  తనకంటే తక్కువని ఒప్పించుకుందీ లేదు,
కుడితో సమానమని ఎడుమ  నిరూపించుకుందీ లేదు.
so, కుడి ఎడుమయితే... పొరపాటు ఉంది.
అయితే...చాకలి యజమానికి గాడిద్ చాకిరి అవసరమే,
కుక్క విశ్వాసమూ అవసరమే!
అలాగే 99 పనులు చేసే కుడి భుజం అవసరమే,
ఏదో ఒక్క ముఖ్యమైన లేదా అముఖ్యమైన పని చేసే ఎడుమ  భుజమూ అవసరమే.
Note : రెండు చేతులే ఒక రకంగా లేనప్పుడు ఏ ఇద్దరు మనుష్యులైనా ఒక రకంగా ఎందుకుంటారు? ఎందుకుండాలి??
{ ఒక సంస్థకు చెందినా ముగ్గురు partners profit పంచుకునేటప్పుడు..
ఒకరేక్కువ కష్టపడ్డామంటే ఒకరేక్కువ కష్టపదామని గొడవ పడ్డారు.
దాంతో విడిపోయారు. ఆ తర్వ్వాత ముగ్గురూ ...  -  - ...  పోయారు!}


Friday, October 5, 2012

శ్రమ.. నా ఉత్సవం!

వ్యాపారిని కాదు నేను, వ్యవసాయిని!
.. ఎవరో రక్తం చిందించి, చమటోడ్చి పండించిన, ధాన్యం కుప్పపై
కుర్చీ వేసుకుని కూర్చుంటే వచ్చే ఆనందం...నాకు అంటదు!
 నేల దున్నాలి
విత్తు నాటాలి
నారపోయాలి
నీరు కట్టాలి
కలుపు తీయాలి
కొత్త కోయాలి
పంట నూర్చాలి...
అప్పుడు...
ధాన్యం పిడికిట పండాలి 
ఆనందం గుండె నిండాలి, 
శ్రమ.. నా ఉత్సవం!

Friday, September 7, 2012

మీ చేతులు మీకు సరిపోతున్నాయా??

బిజీ జీవితంలో
లేదా
జీవితంలోని గజి బిజీలో 
అన్ని పనులు చేసుకోడానికి, 
కనీసం ఇన్ టైం లో పనులు చేసుకోడానికి...
"నాకు నా చేతులు సరిపోవడం లేదు!"
to be frank...
మీ చేతులు మీకు సరిపోతున్నాయా?
నా వరకు నాకు మాత్రం రెండు చేతులు సరిపోవట్లేదు!

సూర్యోదయం, సూర్యాస్తమయం
కొంచెం గాలి, కొంచెం నీరు
కొంచెం నిప్పు, కొంచెం ఉప్పు..
కొంచెమే తిండి, కొంచెమే బట్ట
కొంచెం గూడు..గూడంత నీడ 
ఇవి! ..ఇవే వెనుకటి మనిషి అవసరాలు.
కాని ఇప్పుడో...
ఎన్నో ఉన్నాయి,
ఆ ఉన్నవి కూడా కొంచెం కొంచెం కాదు, ఎంతో కావాలి.
మరి ఇంత కావాలంటే.. చా..లా.. చేయాలి.
అలా చేయాలంటే, ఇతర వనరుల సంగతి సరే...
కనీసం పనులు చేయడానికన్నా ఓ పది చేతులు కావాలి కదా!

by suppose...
నాకే ఎన్ని చేతులు కావాలో ఓ సారి చూస్తె 
వ్రాసుకోడానికి ఒక జత 
వండుకోడానికి ఒక జత 
పిండుకోవడానికి ఒక జత 
తినడానికి ఒక జత 
తిన్నవి తోముకోడానికి ఒక జత
ఫేస్ బుక్ కోసం ఒక జత 
ఫ్యాషన్స్ కోసం ఒక జత 
జాబు చేయదానికిన్ ఒక జత
గీబు చేయదానికొక జత
గాడ్ కోసం ఒక జత, డాగ్ కోసం ఒక జత 
ఇంకా ఎప్పటికప్పుడు చాలా జతలు అవసరమవుతున్నా
కనీసం ఆఖరి అవసరంగా వీపు గోక్కోడానికైనా మరో జత ఎక్స్ట్రాగా  కావలసిందే..!

so, ఇందు మూలంగా నాకు జ్ఞానోదయం అయ్యిందేమంటే...
పరిణామ క్రమంలో జిరాఫ్ఫీ మెడ సాగినట్లు మనిషికీ ఓ పది జతల చేతులు మొలిచే అవకాశం.... 
ఆహా.... ఉంటే బాగుండేది!
ఉండొచ్చు.
ఉంది! ఎందుకంటే జీవ పరిణామం ఉంది కనుక!
కనీసం జిరాఫీలాగా జైవికావసరమైతే చాలా చాలా ఉంది!
కాని చిక్కేంటంటే...
అప్పటికెప్పటికో చేతులు మొలిస్తే మరి ఇప్పటికిప్పుడెలా ?
కనీసం ఇనుప మర చేతులైనా తయారు చేసుకుంటే బాగుంటుందేమో.
కాకపొతే, "మా"నవ పరిణామ క్రమంలో "దా"నవత్వంగా మారిన ఈ రోజుల్లో
ఇనుప చేతులు  అంటే.. 
మనసు ఆధీనంలో  ఉండని మనిషి ఆధీనంలో ఉంటాయన్న నమ్మకం లేదుగా.
అవునా.., అయితే మరి ఇప్పుడెలా???
ఆరి దేవుడా ఈ పరిణామంకి  వేల సంవత్సరాలు ఎందుకు పడుతోందో? 
ఇంత కన్నా తొందరగా పరిణామ క్రమం speed-up చేయడానికి..
నీకున్న వేల చేతులు నీకు సరిపోతున్నట్లు లేవు!
...చూస్తుంటే.. 
దేవుడా.. ముందైతే పరిణామం చెందాల్సింది నువ్వన్న మాట!!!!!
మరి త్వరగా కాని స్తే... మేం క్యూ లో ఉన్నాం స్వామీ 
కానీ దేవుడోయ్ నీకో హెచ్చరిక: లేదంటే మీరే క్యూ లో ఉండాల్సి వస్తుంది.
మాకు ఒక్కొక్కరికి ఒక్క జత చేతులే ఉన్నప్పటికీ.. 
మేం తలచుకుంటే మా ప్రజా స్వామ్యంలో అందరం ఏకమై
కోట్ల జతల చేతులతో ఎవరినైనా పడగొడతాం, ఎవరినైనా నిలబెడతాం.  
So, Oh GOD.. మీ చేతులు మీకు సరిపోతున్నాయా??

లేదంటే త్వరగా పరిణామం చెందండి  
ఇదండీ సంగతి!!

Tuesday, July 10, 2012

శిధిల స్వప్నాలు లేదా స్వప్నాల శిధిలాలు

కలల సౌధాలు కూలిన విధ్వంశం..
మనసులోని ఆ స్థలాన్ని విద్వేషమై పీడిస్తుంది.
శిధిల వీధులు పునర్నిర్మాణానికి ససేమిరా అంటుంటాయి..
కూలిన ఆ గోడల ఇటుకలు.. 
ఇనుప గోళాలై పరుగెట్టిస్తాయి,
ఆ పరుగు కూడా చాలదన్నట్లు సవాలు చేస్తూ..
కలల శిధిలాలు..లేదా శిధిల శకలాలు..
ఫ్లయింగ్ సాసర్లలా వెంటపడి వేటాడుతుంటాయి.. 
మనసు పడి మరీ కట్టుకున్న ఆ కోటల బీటలు.. 
పచ్చని చెట్లను బూడిద కుప్పలు చేశాయి.
పూలు ఉరేసుకున్న ఆ వసారాలలో.. నా ఉసురే ఆవిరై.. 
కొమ్మ, కొమ్మనూ తచ్చాడి తల్లడిల్లి ఏడుస్తోంది.
పాతిక సంవత్సరాలుగా పాగా వేసుకున్న ఆ పాములు.. 
ఆ చోటును శుభ్రం చేయనివ్వకుండా తరుముతున్నాయి.
పారిపోయి కొత్త కలలో తలదాచుకుందామంటే..
కాలం తోటలో ఖాళీ స్థలాలు లేవు. 
ఆయుష్షు  తీరిన హృదయ శకలాలకు.. 
దీక్షగా ఇంకో పాతిక వసంతాల కోసం స్వప్న సౌధాలు నిర్మించే శక్తి లేదు.
శిధిలాల రోదన కన్నా సమాధుల శాంతి ఎంతో సులభం.
కలల లోకంలోకి తొంగిచూడకుండా, నా చిన్ని కళ్లను కప్పెట్టటానికి.. 
కాటుక డబ్బీ అంత కఫ్ఫిన్ దొరికితే బాగుండు.
నా కోసం ఇంకెవరైనా కలగంటే..
నా కలను ఇంకెవరైనా కని.. పెడితే..
ఇది  కూడా..
శిధిలాలకు తెలియకుండా మొలకెత్తుతున్న కొత్త కలేమో...
... కూలిన కలల మైలు రాయి దాటాక.., 
సరికొత్తగా  అర్థమయ్యే  పాత సిద్ధాంతం...
basically all emotional and physical desires of human beings can never be fulfilled.
so, basically human beings have to recognize themselves as beings of pure will.
ఏం, ఈ logic 1వ మైలు రాయి దగ్గరే అర్థం అయి ఉండవచ్చుగా! 
ఏం చేస్తాం, అంతా Higgs Boson MAGIC!!

Friday, March 23, 2012

The Three Real Heroes Of Freedom



Pay tributes to Shaheed Bhagat Singh, 
Rajguru & Sukhdev 
on their death anniversary today. 


This day is also dedicated 
to millions of other Indian martyrs 
who have given their life for the country....

Friday, January 6, 2012

An Angelic Lession:

Awareness about Making Of Love: from OSHO..
An Angelic Lession:
- ఇంటిని దేవాలయంలా...
ఒంటిని దేవతాంశా స్వరూపంలా...
Manage చేసినప్పుడు...,
మానవ జీవత సత్యాలు వాటంతటవే తెలుస్తాయి..! -
And..., BE WITNESS FOR EVERYTHING..
OSHO: Making Love Is a Sacred Experience