వ్యాపారిని కాదు నేను, వ్యవసాయిని!
.. ఎవరో రక్తం చిందించి, చమటోడ్చి పండించిన, ధాన్యం కుప్పపై
కుర్చీ వేసుకుని కూర్చుంటే వచ్చే ఆనందం...నాకు అంటదు!
నేల దున్నాలి
విత్తు నాటాలి
నారపోయాలి
నీరు కట్టాలి
కలుపు తీయాలి
కొత్త కోయాలి
పంట నూర్చాలి...
అప్పుడు...
ధాన్యం పిడికిట
పండాలి
ఆనందం గుండె నిండాలి,
శ్రమ.. నా ఉత్సవం!
No comments:
Post a Comment