కలల సౌధాలు కూలిన విధ్వంశం..
మనసులోని ఆ స్థలాన్ని విద్వేషమై పీడిస్తుంది.
శిధిల వీధులు పునర్నిర్మాణానికి ససేమిరా అంటుంటాయి..
కూలిన ఆ గోడల ఇటుకలు..
ఇనుప గోళాలై పరుగెట్టిస్తాయి,
ఆ పరుగు కూడా చాలదన్నట్లు సవాలు చేస్తూ..
కలల శిధిలాలు..లేదా శిధిల శకలాలు..
ఫ్లయింగ్ సాసర్లలా వెంటపడి వేటాడుతుంటాయి..
మనసు పడి మరీ కట్టుకున్న ఆ కోటల బీటలు..
పచ్చని చెట్లను బూడిద కుప్పలు చేశాయి.
పూలు ఉరేసుకున్న ఆ వసారాలలో.. నా ఉసురే ఆవిరై..
కొమ్మ, కొమ్మనూ తచ్చాడి తల్లడిల్లి ఏడుస్తోంది.
పాతిక సంవత్సరాలుగా పాగా వేసుకున్న ఆ పాములు..
ఆ చోటును శుభ్రం చేయనివ్వకుండా తరుముతున్నాయి.
పారిపోయి కొత్త కలలో తలదాచుకుందామంటే..
కాలం తోటలో ఖాళీ స్థలాలు లేవు.
ఆయుష్షు తీరిన హృదయ శకలాలకు..
దీక్షగా ఇంకో పాతిక వసంతాల కోసం స్వప్న సౌధాలు నిర్మించే శక్తి లేదు.
శిధిలాల రోదన కన్నా సమాధుల శాంతి ఎంతో సులభం.
కలల లోకంలోకి తొంగిచూడకుండా, నా చిన్ని కళ్లను కప్పెట్టటానికి..
కాటుక డబ్బీ అంత కఫ్ఫిన్ దొరికితే బాగుండు.
నా కోసం ఇంకెవరైనా కలగంటే..
నా కలను ఇంకెవరైనా కని.. పెడితే..
ఇది కూడా..
శిధిలాలకు తెలియకుండా మొలకెత్తుతున్న కొత్త కలేమో...
... కూలిన కలల మైలు రాయి దాటాక..,
సరికొత్తగా అర్థమయ్యే పాత సిద్ధాంతం...
basically all emotional and physical desires of human beings can never be fulfilled.
so, basically human beings have to recognize themselves as beings of pure will.
ఏం, ఈ logic 1వ మైలు రాయి దగ్గరే అర్థం అయి ఉండవచ్చుగా!
ఏం చేస్తాం, అంతా Higgs Boson MAGIC!!

No comments:
Post a Comment