సంగీతం అంటే చాలా మందికి ఎంతో ఇష్టం...
అందరూ అంటారు...
బాధను మరచిపోతున్నాం
problmsని మరచిపోతున్నాం
కష్టాన్ని మరచిపోతున్నాం
హాయిగా enjoy చేస్తున్నాం
గాల్లో తేలిపోతున్నాం
Time ఎలా గడచిందో తెలియకుండా గడచిపోయింది
ప్రేమలోనే మైమరచి పోయేలా ఉందా మధుర సంగీతం
భగ్న ప్రేమను, భగ్న హృదయం బాధను ఓదార్చింది
అలా ప్రశాంతంగా ఆనంద సాగరంలో మునిగి తేలాం
ఏ disturbance లేకుండా హాయిగా నిద్రపోయాం
DEEPగా ధ్యానం లోకి వెళ్ళిపోయాం...
అంటారు!!!
లేదా...
సంగీతమే ఒక ధ్యానం అంటారు...
...వాళ్లు ఖాళీగా ఉన్నారేమో వాళ్లను వాళ్లు సంగీతంతో నింపుకుంటున్నారు
సంగీతం అంటే ఇష్టం,
పాట, బీటు, ఫ్లూటు...ఆహా-ఓహో అని
కొంతమంది ఇష్టపడతారు
మరి కొంత మంది అందులో నిష్ణాతులయ్యి సృష్టిస్తారు!
ఏం నీకు నచ్చదా...
అంటారు!
నాకూ...ఏం చెప్పాలో తెలియదు.
నిజంగా పైన చెప్పిన ఏ అలజడినీ ఏ సంగీతమూ
అంతగా కలిగించలేదు నాలో!
ఏదైనా English Horror చూసేటప్పుడు అది కాస్త భయాన్ని
తెలుగు సినిమా దుఃఖ సాగరం కాస్త కంట తడినీ
చౌరాసియా ఫ్లూటు కాస్త ప్రశాంతతనీ
కలిగించి ఉంటే కలిగించి ఉండవచ్చు.
బహుశా సంగీతం ఏమైనా నింపడానికి నేను ఖాళీగా లేననుకుంటా!!
ఇలా ఆలోచించినప్పుడు...
"నేను ఖాళీగా లేనని నన్ను నేను కనుక్కున్నాను."
నేను నిండి పోయి ఉన్నాను...
నా లోని ఆలోచనలు, ఆవిష్కరణలు
కొండొకచో నా అలజడులతో నేను నిండిపోయి ఉన్నాను.
నాకు తెలిసిన మంత్రాలతో, గురువులు చెప్పిన సాధనలతో
Science శాస్త్రీయ శోధనలతో... సతమతమయ్యేంత శబ్దాలతో...
నిశబ్దాన్ని నింపడానికి నేను ఖాళీగా లేననుకుంటా!!
నిశబ్ధం లేని చోట నేను ఏ శబ్దాన్నీ నింపలేనని కనుక్కున్నాను.
గాలి ప్రవాహమో, రక్తం ప్రవాహమో
కనీసం ఆలోచనల ప్రవాహమో...
"నాలోనే ఓ సంగీతం నిండి ఉందని నేను కనుక్కున్నాను!"
అద్భుతాలు, అభూత కల్పనలు
లేదా శాస్త్రీయ నిరూపణలు...
కనీసం సామాజిక స్వరూపాలు...
కళలూ, కవిత్వాలు
ఏ రస భాషలైనా
శ్రవణం, దృశ్యం, భావం...
మూడూ కలిస్తే తప్ప నాలో ఏ స్థాయీ భావమూ మూర్తీభవించదు=(ఏ feelings రావు అని దాని అర్థం.)
అందుకే వినడం కన్నా చదవడం impact
చదవడం కన్నా చూడటం impact
చూడటం కన్నా ఊహించడం impact
ఇక ఊహించింది రాయటం ఎంతో impact
ఇవన్నీ విడి విడిగా కన్నా కలిసి చేస్తే మరీ impact
ఇక పొతే...ఇవన్నీ కలిసి జరిగే చోటు...CINEMA!
So...నాకు సినిమా అంటే ఇష్టం అని నేను కనుక్కున్నాను.
నాకు ఇష్టమైన దాంట్లోనే నా ఆనందాన్ని నేను కనుక్కున్నాను.
ఇలా...ఇలా...
నాలోనే సంగీతం ఉందని నన్ను నేను కనుక్కున్నాను
నాలోనే ధ్యానం ఉందని నన్ను నేను కనుక్కున్నాను
నాలోనే ఆనందం ఉందని నన్ను నేను కనుక్కున్నాను
నాలోనే ఆవిష్కరణ ఉందని నన్ను నేను కనుక్కున్నాను
అందుకే...నన్ను నేను ప్రపంచం ముందు ఆవిష్కరించుకుంటున్నాను...
{{ ...ఒక Music bit వింటున్నప్పుడు...వెయ్యో సారో, లక్షో సారో గుర్తు లేదు కానీ...బాగా conformగా అనిపిస్తే...ధైర్యంగా రాశా! }}
ప్రవీణ గారూ !
ReplyDeleteమీ భావ వ్యక్తీకరణ కొత్తగా బావుంది. అభినందనలు.
TQ Rao Garu!
ReplyDeleteNenu music ekkuvaga vintanu. ante nenu chala khaleega unnana?-Ananta
ReplyDeleteమొదట ఏంచెబుతున్నారో అర్దంకాలా అలా చదువుతుంటే ఏదో అర్దం అయినట్టుంది....మొత్తచదివాక అసలు విషయం అర్దం అయింది సో అలా జరిగిందన్న మాట నాకు అర్దంకాక అడుగుతాను ఇంతకీ మీరు ఏంచెప్పారు నాకు ఏం అర్దంఅయింది...So Some Thing is Diffrent
ReplyDelete@Anitha...
ReplyDeleteTo be Frank...yes!
@నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి...
ReplyDeleteYaa, something is really different!
TQ!