Sunday, August 15, 2010

దేశం మనదీ తేజం మనదీ.... ఎగురుతున్న జెండా మనదే!



దేశం మనదీ తేజం మనదీ....
ఎగురుతున్న జెండా మనదే....
సాయంత్రం నీరెండలో
టెర్రస్ పైన పాడుకుంటూ ఆడుకుంటున్నారు పిల్లలు.
ఇండిపెన్డేన్స్ డే సెలెబ్రేషన్స్...
ప్రతి టీవి చానెల్ లోనూ దేశ భక్తి గీతాల వెల్లువ.
........పిల్లలను పలకరించి ఇండిపెన్డేన్స్ డే గురించి వివరాలడిగా
ఇండిపెన్డేన్స్ గురించీ, వాళ్ళ వాళ్ళ స్కూల్స్ లో ఎలా సెలెబ్రేట్
చేశారనే దాని గురించీ చిలకల్లా చెక, చెకా చెప్పారు
పాటలను ఉత్సాహంగా పోటీలు పడీ పాడారు....
ఏ ప్రశ్నకైనా సమాధానం ఉంది వాళ్ళ దగ్గర
కానీ, దేనికీ మీనింగ్స్ మాత్రం తెలీవు!
సారే జహా సే అచ్చా, వందేమాతరం,
భాషేదైనా పాడతారు కానీ, భావమే తెలీడం లేదు!
హా...శ్చర్య పోవలసిన విషయము ఏంటంటే
భారత స్వాతంత్ర్య పోరాటం గురించి, దేశం గురించీ పక్కన పెడితే...
పర భాషా పదాలు తెలిసినంతగా తెలుగు తెలియడం లేదు!!
దేశం...అంటే  country ...అని చెబుతున్నారు,
మరి రాజ్యం అంటే...బిక్క ముఖాలు వేశారు.
ఈ లోగా ఇంకో గమ్మత్తైన విషయం జరిగింది.
పిల్లలకు దేశమంటే ఏంటి, రాజ్యమంటే ఏంటి చెప్పే లోగా ...
పదేళ్ళ నుంచీ పబ్లిషింగ్ రంగం లో ఉన్న ....    .... అంకుల్ వచ్చారు
'రాజ్యమన్నా దేశమన్నా ఒకటేరా' .....అన్నాడు
(నాతో పోటీ పడాలని ఆయనకు చాన్నాళ్ళ నుంచీ ఉబలాటం.)
హిహిహ్హి హ్హీ....ఏదో సాధించినట్టు వెటకారం నవ్వు నవ్వాడు.
( నాకూ నవ్వొచ్చింది కానీ ఫేస్ టు ఫేస్...వూహు)
ఈ లోగా ఇంకో నలుగురు, ఏంటి..ఏంటి అంటూ వచ్చి జాయిన్ అయ్యారు
....ఆందరూ ఒకటే మాట...రాజ్యమన్నా.. దేశమే!
అంటే కేవలం దేశం కు సినానిం గా వాడేదేనా రాజ్యం?!
మీనింగ్స్ పిల్లలకు తెలివనుకున్నాను.
కాదు, మనకు తెలిస్తే కదా వాళ్లకు చెప్పేదీ...
దేశం అంటే కొన్ని సరి హద్దుల మధ్య
కొంత మంది నివసించే భౌగోళిక ప్రదేశం!
రాజ్యం అంటే... రాజరికం.... అంటే పరిపాలన చేసేది.
....మన దేశం మన పరిపాలనలో ఉంటే,
ఆ స్వతంత్ర దేశాన్ని 'మన రాజ్యం' అంటాం!
పూర్వం నుంచి కూడా...
ప్రజలు సంభాషించేటప్పుడు 'మా దేశం లో' అని,
పరిపాలించే రాజులు సంభాషిన్చేటప్పుడు 'మా రాజ్యం లో' అని వాడే వారు.
country noun NATURAL LAND - దేశం :


country noun POLITICAL UNIT - రాజ్యం :

మాత్రు భాష తెలిస్తే మాత్రు దేశం గురించి తెలుస్తుంది
అప్పుడే మన సంస్కృతీ, సంప్రదాయాలు, మన సంపద
మన ఆకలీ, మన అవసరాలూ
మన ప్రజలు, మన వెతలూ...తెలుస్తాయి.
అంతే గానీ,
ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియాన్స్ ఆర్ మై బ్రదర్స్ & సిస్టర్స్
ఐ లవ్ మై  కంట్రీ......  అంటే సరిపోదు!

మన గురించి మనం తెలుసుకోవాలి
మన భావం తెలియాలీ, మన భాష తెలియాలి!
దేశం మనదీ తేజం మనదీ.... ఎగురుతున్న జెండా మనదే!!
జై హింద్!!! జై హింద్!!! జై హింద్!!! జై హింద్!!!

No comments:

Post a Comment