ఒక రోజు చందమామ అద్భుతంగా ఉంటుంది
మరో రోజు చూడ్డానికి ఇష్టపడనంత 'పగిలిన బంతిలా' ఉంటుంది.
ఒకే చంద్రుడు... కానీ భూమి స్థానమో, మన మనసు లోని ఆస్వాదనమో మారుతూ ఉంటుంది!
జననం వేడుక... మరణం విషాదం...
మధ్యలో... ఎన్నో సంతోషాలు, దుఃఖాలు...మనల్ని వెంటాడుతూ ఉంటాయి !
ప్రేమంటే అందరికీ ప్రేమే
కానీ, కొంతమందే ఆ సామ్రాజ్యాన్ని తమకు అంకితం చేసుకుంటారు!
అవసరం
అసూయ
ద్వేషం
కోపం
పగ.. ప్రేమ..
సంతోషం,దుఃఖం...
ఇవన్నీ చచ్చేదాకా మనతో పాటే ప్రయాణిస్తాయి....
.....ఇలాంటి ఎన్నో అనుభూతులు అనుభవాలవుతాయి.
అవే జీవిత జ్ఞాపకాలవుతాయి.
....ఆ ఊహల్ని మొలకెత్తించే 'గులాబీల తోటలను'
అక్షరాలుగా మారిస్తే........
...........కథలవుతాయి
...........కవితలవుతాయి
సరికొత్త రచనలవుతాయి!
No comments:
Post a Comment