కుడి ఎడుమ
... అనగనగా ఒక సారి.. ఒక కుడి చేయి ఒక ఎడుమచేయి
ఒక దానితో ఒకటి గొడవ పెట్టుకున్నాయట.
నేను నీకు ఎన్నో సార్లు ఎంతో సేవ చేస్తుంటాను
కాని, నువ్వు ఎప్పుడో ఓ సారి మాత్రం చేయూతనిస్తుంటావు
అది కూడా అంటీ ముట్టనట్లుగా, వచ్చే రానట్లుగా ఉంటాయి నీ పనులూ.. అందిట, కుడి చేయి.
అలా అంటావెమిటీ నువ్ ఏ పని చేసినా నేనూ నా వంతు సహకారం చేస్తూనే ఉంటాను గా
నేను లేకుండా నువ్ ఒంటిగా చేసే పనులేమున్నాయి... అని ఎడుమ చేయి ఎదురు చెప్పిందట.
నాకే ఎదురు చెబుతావా అని కుడి చేయి గురి చూసి నాలుగు పీకిందట..
నువ్ చేసిందేదైనా, అందులో సగమైనా నేను చేయ్యానా అని ఎడుమ చేయి రెండు తగిలించిందట.
అలా, అలా నాలుగూ, రెండు నిష్పత్తిలో కొంత కలహం జరిగాక రెండూ అలసి పోయాయట.
ఆగి ఆయాసం తీర్చుకుంటుండగా నొప్పితో కూడిన బాధ వల్ల కలిగిన స్పృహతో..
కొంత జ్ఞానోదయం అయ్యింది వాటికి.
ఇలా మనం గొడవ పడటం వల్ల ఏం సుఖం లేదు, బాగా నేప్పేడుతోంది కొంచెం వేళ్లు ఒత్తి పెట్టమందట ఎడుమ
కాసేపటికి, కుడి వంతు వచ్చింది. కుడి చేత్తో హాయిగా సేవలందుకున్న ఎడుమ,
అలవాటు ప్రకారం వాటం లేని వంకరతో అరకొరగా ఒళ్లు పట్టినట్లో లేక
తట్టినట్లో చేసి చేయి దులుపుకుంది.
అనవసరంగా గొడవ పడి కుడి ఆయాస పడటం తప్ప
ఎడుమ తనకంటే తక్కువని ఒప్పించుకుందీ లేదు,
కుడితో సమానమని ఎడుమ నిరూపించుకుందీ లేదు.
so, కుడి ఎడుమయితే... పొరపాటు ఉంది.
అయితే...చాకలి యజమానికి గాడిద్ చాకిరి అవసరమే,
కుక్క విశ్వాసమూ అవసరమే!
అలాగే 99 పనులు చేసే కుడి భుజం అవసరమే,
ఏదో ఒక్క ముఖ్యమైన లేదా అముఖ్యమైన పని చేసే ఎడుమ భుజమూ అవసరమే.
Note : రెండు చేతులే ఒక రకంగా లేనప్పుడు ఏ ఇద్దరు మనుష్యులైనా ఒక రకంగా ఎందుకుంటారు? ఎందుకుండాలి??
{ ఒక సంస్థకు చెందినా ముగ్గురు partners profit పంచుకునేటప్పుడు..
ఒకరేక్కువ కష్టపడ్డామంటే ఒకరేక్కువ కష్టపదామని గొడవ పడ్డారు.
దాంతో విడిపోయారు. ఆ తర్వ్వాత ముగ్గురూ ... - - ... పోయారు!}