శంఖు లోంచి వస్తే తీర్థం
చెంబు లోంచి పోస్తే గంగ!
కొంతమంది చెప్తే చెత్త కూడా గొప్పగా కనిపిస్తుంది.
మరి కొంత మంది చెప్తే... వజ్రాల కుప్ప కూడా మట్టి దిబ్బలా కనిపిస్తుంది.
అందుకేనేమో పెద్దలన్నారు...
శంఖు లోంచి వస్తే తీర్థం,చెంబు లోంచి పోస్తే గంగా అని!
కుటుంబమే ప్రపంచంగా ఉన్నప్పుడు...
ఇంట్లో వాళ్లు దెయ్యం గురించి చెప్పినా వేదమే.
ప్రపంచమంతా కుటుంబమయ్యాక...
ప్రపంచం చెప్పే ప్రతి సోదీ శాస్త్రమే.
...మనలో చాలా మందికి ఉంటుందీ అంటు రోగం
అంటుకునే రోగం...
ఎవర్ని అంటుకుంటే వాళ్ల మాటలను సూక్తులుగా వల్లే వేస్తుంటాం.
ఇక మన జీవన అనుభవ ప్రమాణాలను...
మన విజ్ఞత, విజ్ఞానాలను మరచిపోయి,
కొత్త బాకా ఊదుతాం.
అమ్మా, నాన్నా, తాతా, అత్తా
అందరూ చెప్పినవీ ఆ బాకాలో కొట్టుకుపోతాయి.
కొండొకచో...ఇంట్లో వాళ్లు చెప్పిన దాని కన్నా
బయటి వాళ్లు చెప్పినప్పుడు తు.ఛ. తప్పకుండా పాటిస్తాం.
నిన్నటి దాకా శంఖు అయిన కుటుంబం...
నేడు చెంబుగా మిగిలి పోతుంది.
తర్వాతేముందీ...ఇంక మన చెంబులోని నీళ్లను...
వేరే వాళ్ల శంఖుల్లో పోసుకుని,
కళ్లకద్దుకుని గుటకేస్తాం - సొంత చైతన్యాన్ని అటకెక్కిస్తాం!!
{ నా brothers...బయట ప్రతి వాడూ చెప్పే శంఖు screenplaysకు... పడిపోతుంటారు...
నేనెన్ని dialogues చెప్పినా...ప్చ్ ... no use... చెంబులో గంగలా అయిపొయింది నా పరిస్థితి!!!
So...నా లాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే...friends....
be a shankhu, not a chembu...okay!!
సలహా: చెప్పడమన్నా మానేయ్యండి...లేదా వినే వాళ్లనన్నా మార్చండి!
ప్రపంచం విశాలమయ్యింది...వెళ్లిపోండి.
ఎక్కడో ఓ చోట శంఖు పిలేసు మీ కోసం ఎదురు చుస్తూ ఉంటుంది....}

Experience ...... Experience .........Experience ...... Experience .........Experience ...... Experience .........Experience ...... Experience .........
ReplyDelete@dontfeel...
ReplyDeleteTQ!