Sunday, September 26, 2010

18 సంవత్సరాలు హాయిగా బ్రతికేశా!

శాఖహారమా మాంసాహారమా...
మనిషి ఆహారం ఏమిటి?
మాంసం మనిషి సొత్తు కాదంటున్నారు కొందరు 

మనిషి జన్మ ఎత్తినప్పటి నుంచీ మనం తిన్నది గడ్డి తిన్న జంతువులనేగా
అని చాల మంది నోరు చప్పరిస్తున్నారు
.....ప్రపంచమంతా...డాక్టర్లు, సైంటిస్ట్ లు, స్పిరిచ్యువలిస్ట్ లు...ఎన్నో ప్రయోగాలు...ప్రకటనలు...
అందరూ overallగా..చెప్తోంది ఒక్కటే...ఆరోగ్యం, ఆలోచన, ఆధ్యాత్మికం...
తెలివీ, పుణ్యం, 
నైపుణ్యం, అర్థం, పరమార్థం, వివేకం, విచక్షణ...
అన్నీ ఉజ్వలంగా ఉండాలంటే...
శాఖాహారం is the best!
అని అంటున్నారు.....
ఇక నేను....ఓ ప్రయోగం...చేశాను.
(వాళ్లెవరో చెబితే...నాకూ practical గా తెలియాలిగా  మరి!!)
అమ్మ, అమ్మమ్మా వాళ్ల తరుపున అంతా full non-vegetarians!
నాన్న, నాన్నమ్మా వాళ్ల తరుపున ఎక్కువ శాతం...vegetarian కు ఓటేస్తారు.
ఎవరి కారణాలు వారివి.
ఇక నా ప్రయోగాల జైత్ర యాత్ర మొదలైంది...
ఒకటి కాదు రెండు కాదు...18 సంవత్సరాలు...non-veg...మానేశా!!!
చిన్నప్పు డెప్పుడో...అమ్మ పెడితే కమ్మగా తిన్న మాంసం ముక్కలు...చేప ముక్కలు...గుడ్డు సొనలు...
అన్నీ మరచిపోయా!

18 సంవత్సరాలు హాయిగా బ్రతికేశా!
....వదిలేశాం సరే...తింటే ఏమవుతుందీ....చూడాలి కదా...
2008...december31... మళ్లీ తినడం ప్రారంభించా!!
ప్రపంచం తల కిందులవలేదు....ఇంత వరకూ!
కానీ...observation: కోపం, చిరాకు, అసహనం, అసహాయత, అసూయ, అనారోగ్యం...
నాలో ఏమున్నాయో అవి నాకు తెలిసొచ్చాయి.
నాకే కాదు...అందరికీ తెలిసింది నా కోపం, తాపం...!

 ఇప్పుడు మళ్లీ మానేసే ప్రయత్నం చేస్తున్నా.
ప్రయత్నమే చేస్తున్నా గానీ అడపా, దడపా తినడం....కష్టపడటం!
చచ్చిపోతే శ్మశానంలో పాతేస్తారు...సమాధిలో దాచేస్తారు.
మరి...

మన కడుపు శ్మశానమా?
మనం నడిచే సమాధులమా?

నాలుక మీది రుచి కోసం...చంపి కడుపులో పాతేసే దానికి అలవాటు పడ్డాం.
dead bodies dispose అయ్యేటప్పుడు...విడుదలయ్యే విషాలకు...బలవుతున్నాం.
చిన్నప్పుడు...నాన్న చెప్పాడు...నాలుకను controlలో పెట్టుకుంటే...
ప్రపంచాన్ని జయించ వచ్చని!
అటు తినడంలో...ఇటు మాట్లాడడంలో.
నాలుక జారి లోపలికెళ్లే ఆహారం...
నాలుక జారి బయటకు వచ్చే మాట...
హద్దు దాటితే మనిషికి చేటు చేస్తాయి.
నాన్నమ్మ ఎప్పుడూ అనేది...
'నాలుక దాటితే నరకంలో పడేది ఆహారం. నాలుక మీది రుచే గానీ కడుపుకేం తెలుస్తుందీ అని!'
Heaven తో పని లేదు మనిషికి...,

భూమ్మీద బ్రతికే మార్గాల్లో నడిస్తే చాలు!
మరి ఆ అర్హత సాధిద్దామా... 


Sunday, September 19, 2010

సిగ్గేస్తోందీ...


సిగ్గేస్తోందీ... 
మూడు పూటలా అన్నం తినడానికి!
...కాలే కడుపుతో మనుష్యులు కన్న పిల్లలు కొందరు డొక్కలు ముడుచుకు పడుకున్నారని తలచుకుంటే,, సిగ్గేస్తోందీ... 

సిగ్గేస్తోందీ... 
మేడ మిద్దెల్లో జీవించాలంటే!
నిలువ నీడ లేని బాట పక్కని బ్రతుకులు చూస్తుంటే,, సిగ్గేస్తోందీ... 

సిగ్గేస్తోందీ... 
రంగుల బట్టలు కట్టుకోవాలంటే!
...మురికి కూపంలో చిరిగిన బ్రతుకుల అతుకులు గుర్తొచ్చీ,, సిగ్గేస్తోందీ... 

సిగ్గేస్తోందీ... 
ఆరోగ్యంతో హాయిగా జీవించాలంటే!
...అంతుచిక్కని జబ్బులతో ఎన్నో బ్రతుకులు చితుకుతున్నాయని తెలిసీ,, సిగ్గేస్తోందీ... 

సిగ్గేస్తోందీ... 
ప్రియుని ఊహలు గుండెకు హత్తుకోవాలంటే!
...ఎన్ని నిరుపేద హృదయాలు ఆ సంపద కోసం తపిస్తున్నాయో అన్న ఊహకు,, సిగ్గేస్తోందీ...  

సిగ్గేస్తోందీ... 
ఆకాశం నా హద్దుగా ఎగరాలంటే! 
మురికి సందుల్లోని ఇరుకు ఇళ్లల్లో తోడబుట్టిన మానవ జాతి రెక్కలు విరిగాయన్న విషాదం తెలిసీ,, సిగ్గేస్తోందీ... 

సిగ్గేస్తోందీ... 
గాంధీ బొమ్మను చూస్తుంటే!
...నలగని కోట్లల్లో, నలిగిన నోట్లల్లో బొమ్మలా మిగిలాడని అనుకుంటే,, సిగ్గేస్తోందీ... 

సిగ్గేస్తోందీ... 
మనిషిని కన్న అమ్మ కళ్లల్లోకి చూడాలంటే! 
...పాలిచ్చిన తనువును పైశాచికంగా బేరమాడుతున్న వింత జంతువుల తంతులు చూస్తే,, సిగ్గేస్తోందీ...  

సిగ్గేస్తోందీ... 
భూమ్మీది మనుష్యులమని విశ్వ సంకేతాలు పంపాలంటే!
...యుద్ధపు చీరలు నేసే, కాలుష్యపు కోరలు చాచే విధ్వంశపు సంతతిమన్న సత్యం తోచీ,, సిగ్గేస్తోందీ... 


Sunday, September 12, 2010

అతిలోకసుందరి - A STORY OF SRIDEVI

మానవా....
నువ్వా మాట మానవా...
మానవా అని నేనే పిలుచుకుని,
నువ్వా మాట మానవా...అని నేనే బదులిచ్చి...
టివిలో చిత్ర లహరి మధ్య యాడ్ చూసి
గాల్లో తేలిపోతున్నాను.
ఇంతలో పెళ్ళికని ఊరు వెళ్లిన ఫ్రెండు తిరిగొచ్చింది.
ఇక ఊరి కబుర్లన్నీ ఊరిన్చి ఊరిన్చి చెప్పడం మొదలెట్టింది
చేతిలో తాయిలాన్ని దాచుకున్నట్లు
ఒక విషయాన్ని నాన్చి, నాన్చి...నాన్చి
మొత్తానికి చెప్పింది.
...."పెళ్ళిలో ఫోటోలు తీస్తారు కదా
అవి చాలా బాగా వచ్చాయి. కానీ అందులో నేను మాత్రం..అంటే నా ఫోటో పడలేదు(!)
వేసిన చేతులు వేసినట్లే ఉన్నాయి,
పెట్టుకున్న పూలు పెట్టుకున్నట్లే ఉన్నాయి,
మనిషి మాత్రం మాయం!! 
తెల్లగా యాష్ కలర్లో కనపడీ కనపడకుండా పడ్డాను! ఆః!!"...
అంటూ కాకమ్మ కథలు చెప్పింది.
దొంగ ముఖందీ[తులసి] నేను ఇంకా జగదేక వీరుడు - అతిలోక సుందరి సినిమా చూడలేదని
కన్ఫాం చేసుకునీ కథలు చెప్పింది.
ఎప్పుడూ నేనే కథలు చెప్తున్నానని దానికి కచ్చగా ఉండేది(?)
ఇక నేను...
...అది ఎందుకు ఫోటోలో పడలేదని, తెగ ఆలోచిన్చాననుకున్తున్నారా...
అబ్బే, ఎవరో రేకెత్తించే ఆలోచనలు నేను ఆలోచిస్తానా?
ఛాన్సే లేదు.
మనది కొంచెం డిఫరెంట్ యాంగిల్
అది ఫోటోలో ఎందుకు పడలేదో నాకనవసరం
ఫోటోలో పడకుండా అది మాయమై పోయింది...
సో...అర్జెంట్ గా నేను కూడా మాయమై పోవాలి! అంతే!!
యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషులకు[మనుష్యులకు తప్ప]
అందరికీ మాయమయ్యే విద్యలు తెలుసని,
ఎక్కడో కథల్లో చదివాను
ఐ గాట్ ఎ పాయింట్,యాక్త్చువల్లీ ఐ క్రియేట్ యాన్ ఆపర్త్చునిటి!
....యాంగిల్ కెమెరాలో కాదు ఈ సారి స్క్రీన్ప్లే లో మార్చుకోవాలి...
ఊర్లో తంత్రాలు తాయెత్తులు కట్టే అంకుల్ ఒకాయన ఉన్నాడు.
యక్షులను వశం చేసుకోవడానికి,
అర్ధ రాత్రిళ్లు జిల్లేడు చెట్ల దగ్గర జపం చేస్తుంటాడని(!?)
విశ్వసనీయ వర్గాల సమాచారం!
కాలం కలిసోచ్చీ ఓ ఫ్రెండుకు జ్వరమొచ్చింది
వాళ్లమ్మ తాయెత్తు కట్టించడానికి తీసుకెళ్తుంటే...
మా అమ్మకు తెలియకుండా ఎలాగోలా వీలు చేసుకుని తోడు వెళ్లాను.
తాయెత్తు అంకుల్ ను మెల్లిగా కదిపాను...
...."ఎక్కడో కథల్లో చదివాను
నేను కూడా అలాంటి కథలు రాయాలీ, కాస్త..ఆ..ఆ..వివరాలేమైనా చెప్తారా అని కూపీ లాగాను
నా ఎంతుజియాజం [?!]చూసి, కాస్త బ్రతిమాలాకా, ఎట్టకేలకు ఒప్పుకున్నాడు.
తన దగ్గర ఉన్న యంత్ర, మంత్ర, తంత్ర సాధనా బోధనల అచ్చు బుక్కును జిరాక్ష్ తీయించి
బాబా గుడికి వచ్చినప్పుడు [పక్కన్నే మా ఇల్లు]నాకు ఇచ్చి వెళ్ళాడు.
[ఇంతకీ ఆయనకెందుకు నేనంటే ఎంతుజియాజమో అప్పుడే తెలిసింది. తను కూడా నా నుంచి
కొన్ని కూపీలు లాగాడు...ఎఫ్.ఎం రేడియోకు కథలు ఎలా పంపాలీ, పేపర్ కు ఒక వైపునే రాయాలా,
ఎన్ని లైన్లు రాయాలీ, అది మనమే చదవాలా, డబ్బులెన్తిస్తారూ, పత్రికలకైతే ఎలా?
నచ్చక పొతే రిటన్ పోస్టేలా...ఎసెట్రా కూపీలు లాగాడు. దాంతో ఆయనకూ నాకూ చెల్లుకు చెల్లు!]
ఇక, మంత్రాల బుక్కు చేతికందిన మరుక్షణం నుంచీ నేను...
అమావాస్య ముందొస్తుందా...
పున్నమి ముందొస్తుందా...
...యెన్దుకనుకున్తున్నారూ...
ఇన్కెన్దుకూ...జిల్లేడు చెట్ల దగ్గర జపం చేయడానికి!!
ఏది ముందొచ్చిందో తెలుసా..
జగదేకవీరుడు-అతిలోకసుందరి సినిమాకు వెళ్ళాలనుకున్న రోజు ముందుగా వచ్చింది.
ఫోటో మ్యాజిక్ తెలిసిపోయింది
హమ్మయ్యా, రాత్రిళ్లు జపం చేసే బాధ తప్పింది.తంత్రానికీ నాకూ చెల్లు.
[అయినా, పగలే మా అమ్మ సరిగా బయటకు వెళ్లనివ్వదూ, అట్లాంటిది రాత్రిళ్లు మంచం దిగనిస్తుందా!?]
కథ...ముగిసిందనుకున్నారా...
కాదు, మళ్లీ మొదటికొచ్చింది...
  ...మానవా మానవా మానవా...
అతిలోకసుందరి దెయ్యం పట్టినట్లు పట్టింది
ఎటు చూసినా శ్రీదేవే![ఆర్ జీ వీ కే  కాదు నాక్కూడా శ్రీదేవిని ప్రేమించే రైట్స్ ఉన్నాయి.]

మోనాలిసా లాగా...

 ఆమె అందం ఆమె బుగ్గల్లోనే ఉంది!
ఆమె బుగ్గల్లో ఏమి దాచుకుందో ...
నిగ్గు తేల్చే దాకా నిద్ర పొకూడదనుకున్నాను...
కంట్లో క్రోవ్వోత్తులు వేసుకుని ...పని ప్రారంభించా
....శ్రీదేవి పేపర్ కట్టింగ్ లు, గ్రీటింగ్ కార్దులూ కలెక్ట్ చేశా.
పాత పుస్తకాల కట్టలో దాచిపెట్టిన, శ్రీదేవి రామా బీడికట్టల యాడ్ పోస్టర్ తీసి,
చిరిగినా చోట్ల టేప్ వేసి అతికించి,
మళ్లీ నా మంచం ఎదర గోడకు అతికించేశాను.

ఆహా...అతిలోకసుందరి!
[మగధీర వస్తాడని సిక్స్త్ సెన్స్ కు తెలుసేమో...జగదేకవీరున్ని మరచిపోయా.]

....అందరి లాగా బయట ప్రపంచపు లోక జ్ఞానం లేని అమాయకత్వమా?

 అమాయకత్వం లోని ప్రశాంత పార్శ్వమా?

ప్రాపంచిక అనుభవాల పట్ల నిర్మోహత్వమా?

అన్నీ తెలిసిన ఆరిందా తనమా?

తెలిసీ తెలియని వివశత్వమా?

నాకున్నదిదే..అందగత్తెను అన్న గర్వమా?

లేక కోపంతో ఎవరి పైనైనా పల్లు కొరుకుతూ ఉంటుందా?

ఏముందా బుంగ మూతి బుగ్గల్లో???????
...సౌందర్యమంతా మార్మికతలోనే ఉంటుందేమో...

తర్వాత ఎంత మంది ఎంజలినాలు వచ్చినా  ఎప్పటికీ శ్రీదేవే ఏంజెల్!!
[తప్పదు. శ్రీదేవిని ఈ మాత్రం ప్రేమించాక పొతే ఆర్.జీ.వీ తో పోటీ పడలేం?]
ఇంచు మించుగా రామా బీడికట్టల యాడ్ లో శ్రీదేవి పై ఫోటోలోలా ఉండేది.
[రామా బీడీ కట్టల పోస్టర్ చిరిగిపోవడమే కాక...పోగొట్టుకుపోయిందన్న బాధతో....నేను....బోనీతో శ్రీ. అతిలోకసుందరి కథ కంచికి]

Sunday, September 5, 2010

SATYAM 70mm at AMIR PET, HYDERABAD-500 016!

                                సత్యం థియేటర్, అమీర్ పేట్, హైదరాబాద్ ఐదు లక్షల పదహారు!

సత్యం థియేటర్ లో సినిమా చుసిన అనుభూతే వేరు.
ఆరామ్ గా టికెట్స్ బుక్ చేసుకుని, ఎంత కూల్ గా సినిమాకు వెళ్ళినా,
ఈ సినీమాక్సుల్లో, ఐమాక్సుల్లో దొరకదు ఆ మజా!
మన దగ్గరకు వచ్చేసరికి టికెట్స్ ఉంటాయో లేదో అనే...
ఆ చిన్న టెన్షన్ లోనూ ఓ థ్రిల్ గుండెను డ్రిల్ చేస్తూ ఉంటుంది.
ఇక ఫాన్స్ మధ్య కూర్చుని సినిమా చూడటం......కే...క!!
ఒక్కో ఆర్టిస్ట్ ఎంట్రీకి ఒక్కో గోల...
డైలాగ్ డైలాగ్ కు....అరుపులూ....
పంచ్ పంచ్ కూ విసిల్స్....
స్టెప్పు స్టెప్పుకూ...కేకలూ....
ఆహా... ఐమాక్ష్ లో మన సెన్సెస్ శబ్ధం చేయకుండా...
ఎంత బిల్డప్ గా సినిమా చూస్తే మాత్రం..వస్తుందా ఈ సినిమా సంతోషం?!
మా ఇంటి పక్కన సినీమ్యాక్స్ వచ్చాకా...
బంతి భోజనం లాంటి సినిమా విందుకు నోచుకోవడం లేదు
వన భోజనాల వంటి సినిమా సందడి అసలే లేదు.
మొక్కుబడిగా ఎవరికీ వారు ఓ ఇద్దరు వెళ్ళడం సినిమా చూడడం...
సినిమా!!...తప్ప ఏ ఎక్సైటింగ్ ఎంటర్ టైన్ మెంట్ కూ నోచుకోని,
మన తెలుగు ప్రజల పాలిట...ఇది ఒక నీరస నిరుత్సాహం!
అప్పుడే సినిమా ఫ్రెష్ గా రిలీస్ అయింది...
రెండు రోజులకే వీకెండ్స్...
హైదరాబాద్, అమీర్ పేట్, సత్యం థియేటర్ లో సినిమా...
ఇటు సినిమా అభిమానులు,
అటు హీరో అభిమానులూ
వీరిని మించిన ఆదివారం కోలాహలం...
ఎటువంటి సినిమా అయినా అదుర్స్...
సగటు ప్రేక్సకునికి....డబుల్ అదుర్స్ !!
డబ్బులు గిట్టుబాటు, ఎంజాయింగ్ ఎలాట్!!!
{చాలా రోజుల...సంవత్సరాల... తర్వాత, ఇవ్వాళ...సత్యం థియేటర్ లో సినిమా చూశా.
కెవ్వు కేక!...సినిమా హిట్టు ఫట్టు నాకు తెలియదు, అడగద్దు...}