బిజీ జీవితంలో
లేదా
జీవితంలోని గజి బిజీలో
అన్ని పనులు
చేసుకోడానికి,
కనీసం ఇన్ టైం లో పనులు చేసుకోడానికి...
"నాకు నా చేతులు సరిపోవడం లేదు!"
"నాకు నా చేతులు సరిపోవడం లేదు!"
to be frank...
మీ చేతులు మీకు సరిపోతున్నాయా?
నా వరకు నాకు మాత్రం రెండు చేతులు సరిపోవట్లేదు!
సూర్యోదయం, సూర్యాస్తమయం
కొంచెం గాలి, కొంచెం నీరు
కొంచెం నిప్పు, కొంచెం ఉప్పు..
కొంచెమే తిండి, కొంచెమే బట్ట
కొంచెం గూడు..గూడంత నీడ
ఇవి! ..ఇవే వెనుకటి మనిషి అవసరాలు.
కాని ఇప్పుడో...
ఎన్నో ఉన్నాయి,
ఆ ఉన్నవి కూడా కొంచెం కొంచెం కాదు, ఎంతో కావాలి.
మరి ఇంత కావాలంటే.. చా..లా.. చేయాలి.
అలా చేయాలంటే, ఇతర వనరుల సంగతి సరే...
కనీసం పనులు చేయడానికన్నా ఓ పది చేతులు కావాలి కదా!
by suppose...
నాకే ఎన్ని చేతులు కావాలో ఓ సారి చూస్తె
వ్రాసుకోడానికి ఒక జత
వండుకోడానికి ఒక జత
పిండుకోవడానికి ఒక జత
పిండుకోవడానికి ఒక జత
తినడానికి ఒక జత
తిన్నవి తోముకోడానికి ఒక జత
ఫేస్ బుక్ కోసం ఒక జత
ఫ్యాషన్స్ కోసం ఒక జత
జాబు చేయదానికిన్ ఒక జత
గీబు చేయదానికొక జత
గాడ్ కోసం ఒక జత, డాగ్ కోసం ఒక జత
ఇంకా ఎప్పటికప్పుడు చాలా జతలు అవసరమవుతున్నా
కనీసం ఆఖరి అవసరంగా వీపు గోక్కోడానికైనా మరో జత ఎక్స్ట్రాగా కావలసిందే..!
so, ఇందు మూలంగా నాకు జ్ఞానోదయం అయ్యిందేమంటే...
పరిణామ క్రమంలో జిరాఫ్ఫీ మెడ సాగినట్లు మనిషికీ ఓ పది జతల చేతులు మొలిచే అవకాశం....
ఆహా.... ఉంటే బాగుండేది!
ఆహా.... ఉంటే బాగుండేది!
ఉండొచ్చు.
ఉంది! ఎందుకంటే జీవ పరిణామం ఉంది కనుక!
ఉంది! ఎందుకంటే జీవ పరిణామం ఉంది కనుక!
కనీసం జిరాఫీలాగా జైవికావసరమైతే చాలా చాలా ఉంది!
కాని చిక్కేంటంటే...
అప్పటికెప్పటికో చేతులు మొలిస్తే మరి ఇప్పటికిప్పుడెలా ?
కనీసం ఇనుప మర చేతులైనా తయారు చేసుకుంటే బాగుంటుందేమో.
కాకపొతే, "మా"నవ పరిణామ క్రమంలో "దా"నవత్వంగా మారిన ఈ రోజుల్లో
ఇనుప చేతులు అంటే..
మనసు ఆధీనంలో ఉండని మనిషి ఆధీనంలో ఉంటాయన్న నమ్మకం లేదుగా.
మనసు ఆధీనంలో ఉండని మనిషి ఆధీనంలో ఉంటాయన్న నమ్మకం లేదుగా.
అవునా.., అయితే మరి ఇప్పుడెలా???
ఆరి దేవుడా ఈ పరిణామంకి వేల సంవత్సరాలు ఎందుకు పడుతోందో?
ఇంత కన్నా తొందరగా పరిణామ క్రమం speed-up చేయడానికి..
నీకున్న వేల చేతులు నీకు సరిపోతున్నట్లు లేవు!
...చూస్తుంటే..
నీకున్న వేల చేతులు నీకు సరిపోతున్నట్లు లేవు!
...చూస్తుంటే..
దేవుడా.. ముందైతే పరిణామం చెందాల్సింది నువ్వన్న మాట!!!!!
మరి త్వరగా కాని స్తే... మేం క్యూ లో ఉన్నాం స్వామీ
కానీ దేవుడోయ్ నీకో హెచ్చరిక: లేదంటే మీరే క్యూ లో ఉండాల్సి వస్తుంది.
మాకు ఒక్కొక్కరికి ఒక్క జత చేతులే ఉన్నప్పటికీ..
మేం తలచుకుంటే మా ప్రజా స్వామ్యంలో అందరం ఏకమై
మేం తలచుకుంటే మా ప్రజా స్వామ్యంలో అందరం ఏకమై
కోట్ల జతల చేతులతో ఎవరినైనా పడగొడతాం, ఎవరినైనా నిలబెడతాం.
So, Oh GOD.. మీ చేతులు మీకు సరిపోతున్నాయా??
లేదంటే త్వరగా పరిణామం చెందండి
ఇదండీ సంగతి!!