...Situations demands emotions
Emotions commands Relations
Relations Creates Situations...
పరిస్థితులు-స్థల, కాల, పరిస్థితులు- భావోద్వేగాలను...
భావోద్వేగాలు బాంధవ్యాలను ప్రభావితం చేస్తాయి!
Balence చేసుకుంటూ జీవించడాన్నే స్థితప్రజ్ఞత అంటారని తెలుసు
కానీ, ఈ స్థల, కాల, పరిస్థితులు...
నా భావోద్వేగాలతో ఆడుకుంటున్నాయి!
'ఇప్పుడు' పుట్టకున్నా బాగుండేది..
'ఇక్కడ' పుట్టకున్నా బాగుండేది...
'ఇలా' పుట్టకున్నా బాగుండేది...
నా Physical bodyయే నాకు ఒక jail లా ఉంది!
Inner Soul స్వేఛ్చ కోరుకుంటోంది...
అంతరంగ అవసరాలకు అనుగుణంగా
బహిర్గత భాధ్యతలు నేరవేర్చలేము.
లోపలి మనిషి సహించడం లేదు
బయటి మనిషి మాట వినడం లేదు...
ప్చ్, హా...హ్మ్...
సరిగ్గా ఆలోచించాలని ఎంత బలంగా అనుకుంటుంటే...
అంత కన్నా బలంగా సరిగ్గా పనిచేయలేకున్నాను...
నాకు ఒక సరైన శిక్షణ కావాలని అనిపిస్తోంది.
గాయం అయ్యింది కాబట్టి నొప్పి వస్తోందో...
నొప్పి వస్తోంది కాబట్టి గాయం అనుకోవాలో...
అర్థం కావడం లేదు?
టైం సరిపోవడం లేదు కాబట్టి పనులు చేయడం లేదో...
పనులు చేయడం లేదు కాబట్టి టైం సరిపోవడం లేదో...
అస్సలు టైం ఉన్నట్లా, లేనట్లా
అయితే...అంతకన్నా అస్సలు...
నేను ఉన్నట్లా, లేనట్లా
చూడటానికి నా physical body ఉన్నట్లే ఉంది...
కానీ, చూస్తుంటే...నా inner soul లేనట్లుగా ఉంది!
కనీసం..ఇప్పుడు లేదేమో...
హీనం...ఇక్కడ లేదేమో...
హీనపక్షం...ఇలా ఉండ లేదేమో...
నాకు నేను నచ్చట్లేదు...
నచ్చట్లేదు...నచ్చట్లేదు...
ఇది నేను కాదు.
అదిగో...
ఆకాశంలో ఎగురుతోన్న ఆ పక్షిని నేనేమో...
ఆ చెట్టు మీద కదులుతోన్న ఆకుల మధ్య,
వీస్తోన్న గల, గల గాలిని.. నేనేమో...
నా కలల్లో కనిపించే సీతాకోక చిలుకను నేనేనేమో...
ఊరి బయట తోటలో తుమ్మెదలు తాగుతోన్న
పువ్వులలోని తేనెను నేనేనేమో...
ఒకానొక పాడుబడ్డ బావిలో
పాత రాతి మెట్టును నేనేనేమో...
ఏమో...ఎగరాలని ఉన్నా కూడా,
నేల మీద పురుగుల పాకుతున్నది ఎవరో?
పూర్వం ఒక కథలోనే అయినా
ఓ ఈగ తన పేరు మరచిందని విన్నాను..
ఇప్పుడేమో నేనెవరో నాకే గుర్తు లేదు.
ఈ విడ్డూరం విని,
ఎగరలేని చెట్లు చేస్తోన్న ఎగతాళికి...
అదిలిస్తే పారిపోతున్న పిట్టలా
నా నేను ఎక్కడికో పారిపోతోంది...
అయినా వదలక,
ఎదలోని సొద ఎలదేటి రొదలా
వెంటే ఉంటూ తరుముకొస్తోంది...
మనకు ఆకలంటే బాధ
కానీ మనం అన్నాన్ని దాచిపెడతాం.
మనకు డబ్బున్న వాళ్లంటే భయం
కానీ, మనందరం డబ్బు సంపాయించాలనుకుంటాం!
చలేస్తే ఎండంటాం
ఎండొస్తే.. వానంటాం
వానొస్తే...గొడుగంటాం
ఏదో ఓ గోడ కట్టుకోకుండా
మనం బతకలేమా?
నేను పారిపోతున్నానో
తప్పిపోయానో...
తప్పించుకుపోవాలని ఈ తపన!
ఈ కలుగు పై అలిగానానని అనిపిస్తోంది...
ఒక్కోసారి అదే కదా ఆశ్రయమిచ్చి ఆదుకున్నది అనిపిస్తుంది...
అంతలోనే అదో అంతులేని కథ అని భయమేస్తుంది.
ఆకులకంటే పువ్వులు అందమైనవే
కానీ నా చెట్టుకు అవే ఊపిరి.
వేళ్లతో పాటు ఊడలు కూడా
పాతుకపోవడమే జీవితం.
ఈ సత్యం అర్థమైనా
ఉన్న చోటునుండే ఊగిసలాడ్డం ను
ఆపదు అంతరంగ తరంగం...(((((((((((
అందుకే అంటారు...
అద్దానికి ఏ దుమ్మూ అంటకుండా
ఆనందాన్ని మాత్రమే చూసుకునే వాళ్లను...
'ఏ తాడూ-బొంగరం లేని వాడని'...
అంతేనేమో...
జీవితమంటే ఆట..
మనం ఆడుకునేది కాదు,
మనల్ని ఆడుకునేది!
{ Oh My God నన్ను ఎవరైనా కాపాడండి...నేను గింగిరాలు తిరుగుతున్నాను...((((((())))))).....}
[ నిజంగానే.. నాకేం చేయాలో అర్థంకానప్పుడు, అలా బొంగరంలా తిరగేస్తా...ఎవర్నైనా వచ్చి hold చేయమంటా..!]